• Naa Atmakatha Rojuko Sookti
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • నా ఆత్మకథ (స్వామి వివేకానంద) మరియు రోజుకో సూక్తి

    Naa Atmakatha Rojuko Sookti

    Pages: 780
    Language: Telugu
    Rating
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    '4.33/5' From 9 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 premium votes.
Description

ఇది స్వామి వివేకానంద స్వీయచరిత్ర "నా ఆత్మకథ", "స్వామి వివేకానంద స్ఫూర్తి రోజుకో సూక్తి" అనే రెండు పుస్తకాల సంపుటం.

* * *

Naa Atmakatha Thumb "నా వచనాలు స్ఫూర్తిప్రదాలు, అవి ప్రాణవంతాలు" అని ఏసుక్రీస్తు చెప్పడం మీరు విని ఉంటారు. అట్లే, నా మాటలు స్ఫూర్తిప్రదాలు, ప్రాణప్రదాలు. తమ దారిని అవి దగ్ధం చేసుకుంటూ మీ మెదళ్ళలోకి ప్రవేశిస్తాయి. మీరు వాటినుంచి ఎన్నటికీ తప్పించుకుని పోలేరు.
ఆ ఆదర్శాన్ని క్లుప్తంగా ఇలా చెప్పవచ్చు: మానవాళికి వారిలోని దివ్యత్వాన్ని బోధిస్తూ, ఆ దివ్యత్వాన్నిజీవితంలో ప్రతిక్షణం ఎలా అభివ్యక్తం చేయాలో నేర్పడం.
దుష్టవిధి కల్పించే ఆవరణ అంధకార బంధురం. కానీ నేను యజమానిని. చూడు, నేను చెయ్యి ఎత్తగానే అది పటాపంచలవుతుంది! ఇదంతా అర్థరహితం. మరి భయమా? నేను భయానికి భయాన్ని, భీతికి భీతిని. నేను నిర్భయ అద్వితీయ ఏకాన్ని. నేను విధి నియామకుణ్ని, సర్వం తుడిచేవేసేవాడిని. జయశ్రీగురూ!
వితంతువు కన్నీరు తుడిచివేయలేని, అనాథ నోటికి పట్టెడన్నం అందించలేని భగవంతుని పట్లగాని లేదా మతం పట్ల గాని నాకు విశ్వాసం లేదు.
నక్షత్రాలను చూర్ణం చేద్దాం. త్రిభువనాలనూ పెకిలించి వేద్దాం, మనం ఎవరని మీకు తెలియదా? మనం శ్రీ రామకృష్ణుల దాసులం.
అవును! వయసు పెరిగేకొద్దీ నానాటికీ సర్వం పురుషోచిత లక్షణం వల్లనే సాధింపబడుతున్నట్లు నాకు అనిపిస్తోంది. ఇదే నా నూతన వేద వాక్యం!
మన మార్గదర్శకులు మాతృదేవియే! ఏది జరిగినా, ఏది జరగనున్నా అది ఆమె నిర్ణయం మేరకే!

* * *

Rojuko Sookti Thumb

ఓ ధీరహృదయుడా! పట్టు సడలనివ్వకు!
చిరుమబ్బు మరుగులో సూర్యుడే దాగినా
కారు చీకట్లలో స్వర్గమే మునిగినా
ఓ ధీరహృదయుడా! సడలనివ్వకు పట్టు!
వరియించుగా నిన్ను విజయమే తప్పక....

- స్వామి వివేకానంద

Preview download free pdf of this Telugu book is available at Naa Atmakatha Rojuko Sookti
Comment(s) ...

I am surprised to know that, even Swami Vivekananda liked foreign countries, especially US and life in US :)

చాలా మంచి పుస్తకం.
బుక్ మార్కులు ఉండటం వలన మొదటి పుస్తకంలో అధ్యాయాలవారీగా ముందుకీ వెనక్కీ చదవటం సులువయింది.
రెండవ పుస్తకం బహువర్ణమయమయి ఉంటే బాగుండేది.