• Munni
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    80
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మున్నీ

    Munni

    Publisher: Naveenji Foundation

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కళాప్రపూర్ణ డాII అచ్యుతరామరాజుగారు మానవీయ విలువలకు పట్టంకట్టిన మహెూన్నతమూర్తి. "పతితులు, భ్రష్టులు, బాధాసర్పదష్టులు" ఆయన హృదిని కదిలించారు. ఆ సంవేదనాశీలమైన వ్యక్తిత్వమే వారిని ఉత్తరాంధ్ర వినీలాకాశంలో వేగుచుక్కలా నిలిపింది.

రాజుగారు కథ, నవల, నాటకం, కావ్యం, వ్యాసం మున్నగు ప్రక్రియలలో 13 గ్రంథాలు రచించారు. ఈ కథాసంకలనం "మున్నీ" రెండో ముద్రణగా వెలువడటం ముదావహం.

ఈ కథాసంకలనంలో ఎనిమిది కథలున్నాయి. ఇవి ఎల్లలు లేని రాజుగారి సృజనశీలతకు అద్దం పడతాయి. "గంగిగోవుపాలు గరిటెడైన చాలు!" అన్నట్లు ఈ విశిష్ట ప్రయోగాత్మక కథలు మనలను అబ్బురపరుస్తాయి. ఆలోచింపజేస్తాయి. ఆహ్లాదపరుస్తాయి. చివరగా Aristotle చెప్పినట్లు "Tragedy not only rouses these emotions (pity and fear) but also by the way it rouses these effects a catharsis of them" – విషాదాంతాలు. శోక భయాలనే భావాలను కలిగిస్తూ హృదయక్షాళనం చేసి భావోద్రేకాల ద్వారా సాత్త్వికతను కల్గించి..." కంటనీరు పెట్టిస్తాయి.

- డా. తుర్లపాటి రాజేశ్వరి

*****

మున్నీ -
అనేది ఒక మంచి ముత్యం.
"మున్నీ" అనే పేరుగల ఈ సంచిక ఉందే - ఇది ఒక ముత్యాల సంచీ.
దీనిలో దేనికంటే ఏది మంచి ముత్యం అంటే ఏం చెప్పడం?
ఎంచడం చాలా కష్టం!
అయితే ఒక్క సంగతి చెప్పడం మాత్రం చాలా సులభం.
అన్నింటి కంటె మంచి ముత్యం అచ్యుతరామరాజు గారే
మంచి ముత్యం!

- రాచకొండ విశ్వనాథ శాస్త్రి

Preview download free pdf of this Telugu book is available at Munni