• Mulintame
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మూలింటామె

    Mulintame

    Author:

    Publisher: Tom Sawyer Books

    Pages: 116
    Language: Telugu
    Rating
    3.40 Star Rating: Recommended
    3.40 Star Rating: Recommended
    3.40 Star Rating: Recommended
    3.40 Star Rating: Recommended
    3.40 Star Rating: Recommended
    '3.40/5' From 5 votes.
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    3.67 Star Rating: Recommended
    '3.67/5' From 3 premium votes.
Description

పెండ్లి జరిగిన మూడో దినుమే మూలింటామెని బట్టుకోని "ముసిల్దానా! దేనికెప్పుడూ ముటముటా అంటా మూతి నల్లంగా బెట్టుకోనుంటావు? నవ్వతా పేల్తా వుండలేవా నువ్వు? నవ్వు, మా ముసిల్ది గదా, మా ఎర్రక్క చెల్లివి గదా, నవ్వు! నవ్వు!" అంటా రొండు చంకల్లో చేతులేసి చక్కల గిలి పెట్టేదానికి మళ్ళుకొనింది. మేకలు మేపతా వుంటే కొండ చిలువొగటొచ్చి చుట్టుకున్నట్టనిపించి రోత బుట్టి పొయ్యింది మొదుటామెకి. రొండు చేతులూ పైకెత్తి, "నీకు దండం బెడతా తల్లా. యీ వొగిసులో నాకు నవ్వొగటి తక్కవా! నేను చెళ్లకు మనిసిని గాదు. నా జోలికి నువ్వు రాబాక." అనింది. అయినా పందొసంత వొదలకుండా, "నేను నీకు కోడాల్ని గదా. నాతో అచ్చటా ముచ్చటా తీర్చు కోవాలనుకుండదా, నువ్వేమీ ముసిల్దానివే! నలపై నలపై అయిదేండ్ల నీ కొడుకు దగ్గిర, అందులో సగం వయసు గూడా లేని దేనికి బొట్టు కట్టించుకున్నా? మా ఎర్రవ్వ మొకం చూసి! నాతో మా ఎర్రవ్వా, మా ఎర్రవ్వతో నేను ఎంత తమాస తమాసగా వుంటామో తెలుసునా? నీ అక్కే గదా ఎర్రవ్వ. ఆ యవ్వ బుద్ది నీకు దేనికి లేకపోయ్యిందే ముసిల్దినా! నిన్ను ఆ అపక్కట్టితో నాలుగు దొబ్బితే గానీ నువ్వు దోవకు రావా ఎట్ట?" అని పకపకా నవ్వింది.

Preview download free pdf of this Telugu book is available at Mulintame
Comment(s) ...

Bapu gaari letter to author Namini, after reading this book is at http://patrika.kinige.com/?p=2322

నామిని "మిట్టోరోడి కథలు" చదివినప్పటి నుండి ఆయన కథలు ఏవీ మిస్ కాకూడదని ఒట్టు పెట్టుకున్నా.
అంతగా నచ్చుతాయి ఆయన రచనలు నాకు.
ఇప్పుడు "మూలింటామే" కినిగెలో దొరుకుతుందని తెలియగానే ఎంత పని ఒత్తిడిలో వున్నా వెంటనే కొనడం చదవడం అయిపోయింది. మళ్ళీ చదవాలి, మళ్ళి మళ్ళీ చదవాలి.
అదొక పల్లె భారతం. నూటపద్దెనిమిది పుటల్లో ఎన్నెన్ని పాత్రలు, ఎన్నెన్ని ఆలోచనలు, ఎన్నెన్ని కుట్రలు, ప్రేమలు, పంతాలు, సంభందాలు...
పల్లెల్లో మనుషుల స్వభావాలని, మంచినీ, చెడ్డనీ, అమాయకత్వాన్నీ, కోపాలనీ, ప్రేమలని...అన్నిటినీ సిరాగా మార్చి అక్షరాలుగా ఒలికించారు నామిని గారు.

రాయలసీమ వారికయితే త్వరగా ఆ మాండలికము అర్థమవుతుంది. మిగతావారు కేవలం ఒకటో రెండో పేజీలు చదివి బెదిరిపోకండి. కథలోకి మీరు లీనమయ్యాక మీరే రాయలసీమ వాసులయిపోతారు. అది వేరొక మాండలికంలో వున్నదన్న సంగతే మరచిపొతారు.

వెంటాడే విషాద స్వరం – “మూలింటామె” పుస్తకంపై సమీక్ష
http://teblog.kinige.com/?p=3994

Prathi vurlonu oka mulintavva vundi kaaboolu. Maa ammammanu memu mulintavvane antaamu.. nenu raasina kathallo maa mulintavva konni chotla kanipistundi (perindevi penu kukkudu, saaraa veerangam)

Naamini gaari mitturodi kathalu chadivaaka aa spurtitho naa chinnappati gnapakaalanu chinna chinna kathalugaa rayadam modalupettaanu. Vaatilo ' mulintavva- maapeddapeddamma, tamaaminchina maa mulintavva telivi)
Naamini mulintaame navala chadavataavunte naa saamirangaa chaddannamlo maagaaya uuta kalupukoni tintunnamaa anna anubhutiki lonnayyanu. Prapanchikarana nepadyamlo pallello vachina maarpunu kallaku kattinatlayindi. Bhinna manastatvaalu kaligina manushulu sajeevanga edurugaa nilabadinaaru.Dabbu vyaamohamlo padi manaku maname chedupu chesukuntunnamanna satyaanni rachayita enta bhaagaa chepparo. Telugu bhashaku bhadramaina nidhi niksepaalu naaminigaari kathalu. Vaariki naa dhanya vaadaalu.

- Mahaasamudram DEVAKI.