• Mugdha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 115.2
    144
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ముగ్ధ

    Mugdha

    Pages: 310
    Language: Telugu
    Rating
    4.75 Star Rating: Recommended
    4.75 Star Rating: Recommended
    4.75 Star Rating: Recommended
    4.75 Star Rating: Recommended
    4.75 Star Rating: Recommended
    '4.75/5' From 4 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''ఔనే ముగ్ధా! బాడీ లాంగ్వేజ్‌ గురించి నాకు చెప్పవే. నాకు కావలసినవాణ్ని నేను వెతుక్కుంటాను'' అలక అంది.

''బాడీ లాంగ్వేజ్‌ మేజిక్‌ కాదు చిటికెలో చేసి చూపించడానికి. నీకు నచ్చిన ఎవర్నయినా చూపించు. వాడెలాంటివాడో చెప్తాను'' ముగ్ధ ముగ్ధంగా అంది.

''ఐతే సరే. చూడు, ఆ కార్నర్‌ సీట్లో కూర్చున్నాడు చూడు. విమల్‌ ఎడ్వర్టయిజ్‌మెంట్లో మోడల్లా లేడూ! అతడి గురించి చెప్పు. వినాలని వుంది'' కళ్ళతోనే ఆ ముగ్గురికీ, తనకు నచ్చిన ఆ కుర్రవాడ్ని చూపిస్తూ అంది అలక.

మిగతా ముగ్గురమ్మాయిలూ ఆ యువకుడివేపు చూశారు. అతను ఎర్రగా, చక్కగా వున్నాడు. పెదిమలు ఎర్రగా వున్నాయి. ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ, మాట్లాడుతూ మధ్యలో నవ్వుతున్నాడు. ఆ నవ్వు చాలా బాగుంది.

నవ్వుతూ అతడివేపు చూసింది. నిశితంగా చూసింది. మాట్లాడుతున్నపుడు కదులుతున్న అతి కనురెప్పలు, పెదిమలు, చెంపలూ, చేతులూ, నెమ్మదిగా తగులుతున్న ఏసీ గాలికి ఎగురుతున్న అతి మెత్తని జుత్తు, అతను కుర్చీలో కూర్చున్న భంగిమవేపూ అలా చూస్తోంది ముగ్ధ.

ముగ్ధ అతడి గురించి ఏం చెప్తుందోనన్న ఆత్రుతతో మిగతా ముగ్గురూ అతడివేపు, ముగ్ధవేపు చూపులు మార్చి చూస్తున్నారు. మాట్లాడే భాషకు ఎంత శక్తి వుందో, మాట్లాడని శరీరానికి కూడ అంతే శక్తి వుంది.

భాషకు అక్షరాలు ఎంత ప్రధానమైనవో, శరీరానికి కదలికలు అంతే ప్రధానమైనవి.

అదే బాడీ లాంగ్వేజ్‌ - శరీర కదలికల శాస్త్రం.

మనిషి మానసిక స్థితిని అంచనా వేయడానికి ఈ శాస్త్రం ఉపయోగపడుతోంది.

Preview download free pdf of this Telugu book is available at Mugdha