• Mudo Kannu Kavya Darsanam
  • Ebook Hide Help
    ₹ 9
    10
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మూడోకన్ను - కావ్య దర్శనం

    Mudo Kannu Kavya Darsanam

    Publisher: Chalapaka Prakash

    Pages: 79
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భావుకత కలిగి ఉండడమే ఒక కవికి ప్రముఖమైన అర్హత. స్పందనా గుణం గల కవి హృదయం దివ్యావేశానికి లోనైనప్పుడు అది కావ్యంగా రూపుదిద్దుకుంటుంది. ఆలోచన, ఆహ్లాదము మరియు ఉపదేశము మొదలైనవి ఆ కావ్యానికి ప్రయోజనాలవుతాయి. కావ్యం మనిషిని మరింత మంచి వానిగా మలచాలి. దేశభద్రతకు, సౌభాగ్యానికి తోడ్పడాలి. సహృదయత, స్పందనా గుణం, ప్రత్యేకత గల అభివ్యక్తులే వ్యక్తిని మంచి కవిగా ఉన్నతీకరించడంలో తోడ్పడతాయి. ఇటువంటి లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న కవితా సంపుటే చలపాక ప్రకాష్ రచించిన ‘మూడోకన్ను’.

ఆధునిక కవులలో ముఖ్యంగా సామాజిక స్పృహ, దార్శనికత ఉంటేనే సమాజాన్ని చైతన్యపరచడానికి వీలవుతుంది. వీటికి తోడు తాత్త్వికత, తార్కికతలు కూడా భావనా బలాన్ని ప్రకాశవంతం చేస్తాయి. ఈ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న నిరంతర కవి, సహృదయుడు చలపాక ప్రకాష్. ఇతని కవిత్వంలో హంగులు, ఆర్భాటాలు కనిపించవు. పాండిత్య ప్రకర్షను ప్రదర్శించాలనే ఉబలాటం ఉండదు. భాషాడంబరాలకు పోయి పాఠకుడిని బెదరగొట్టడం అస్సలు కనబడదు. ఇతని కవిత్వంలో మానవుని జీవిత పరివేదన ఉంది. అంతేకాదు, కవితా వేశంతోపాటు దానిని సహృదయునికి సంక్రమింప జేయాలన్న తపన ఉంది.

ఈ సంపుటిలో ‘భద్రించుకోవడం, యుద్ధవాన, సరదా పరదాలు, ఆటల తోటలు, ప్రాణరాశులు, భూమ్ మేయడం, ఉప్పెనవతారం, అనుమానితగాళ్ళు, గ్రహపోటు, బెజ్జాలవాడ, కసితనం, స్నేహాభరణం, సక్సెస్ కుప్పలు, స్మార్ట్ వల' వంటి నూతన పదప్రయోగాలు కవి సృజనశక్తిని, కవిత్వాభిలాషను పట్టి చూపిస్తాయి. ఇటువంటి నూతన పదసృష్టితో ఈ కవి మనముందు ప్రయోగ వాదిగా, భాషాభిమానిగా సాక్షాత్కరిస్తాడు.

- పోతగాని సత్యనారాయణ

Preview download free pdf of this Telugu book is available at Mudo Kannu Kavya Darsanam