• Mrutyuloya
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మృత్యులోయ

    Mrutyuloya

    Pages: 312
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

1971-74 మధ్య 'బొమ్మరిల్లు' మాసపత్రిక ధారావాహికంగా అశేష పాఠకులని ఆకట్టుకున్న నవల 'మృత్యులోయ'. శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు రచించిన ఈ బాలల జానపద నవలని పుస్తక రూపంలో - వాహిని బుక్ ట్రస్ట్ వారు, మంచి పుస్తకం వారు సంయుక్తంగా ప్రచురించారు.

* * *

ఈ నవలలో బాలసాహిత్యకారులకు ఆదర్శమైన అంశాలు చాలా ఉన్నాయి. కథానాయకులైన యశ, జయులు ప్రాణాంతక సమయంలో కూడా ఆశావాదాన్ని వీడరు. మడుగు నాయకుడు వారిని చంపడానికి ఒక్క రోజు గడువిస్తే, జయుడు 'మనకింకా ఒక రోజు ఆయుషున్నది' అంటాడు. వారి సాహసకృత్యాల్లో ఒక్కటి కూడా స్వార్థానికి కాదు. ప్రాణాలు పోయేలా ఉన్నప్పుడు కూడా తమ కోసం కాక, ఉడుంబుకిక సాయపడలేమని బాధపడతారు. ఇలాంటి కథల్లో కథానాయికలు సాధారణం. ఈ నవల్లో ఉన్నదే ఇద్దరు యువతులు. సర్పవతిని తొలిపరిచయంలోనే - యువకుడైన జయకేతుడు 'అమ్మాయీ' అని సంబోధిస్తాడు. మరో యువతి భిల్ల రాజకుమారి. ఆమెకు దొడ్డదొరతో పెళ్ళి జరిపించడమే - యశ, జయుల ఆశయం. ఈ నవలలో అసలు సిసలు దుష్టులైన - కురప నాయకుడు, నీలికొండ రాక్షసుడు, నరవానర రాజు, రసాయన భట్టుల పాత్రచిత్రణ - వారి అంతం సముచితం. మిగతా పాత్రలన్నీ మంచి - చెడుల సమ్మేళనం.

గగుర్పాటుకు గురిచేస్తూ, ఉత్కంఠను రేకెత్తించే ఈ సాహస కథ యొక్క కథనం అద్భుతం! సందేశం కాబోయే పాలకులకు దిశానిర్దేశం! చదువరికి వర్తమానంలో మరో ప్రపంచ విహారం, భావిలో వెంటాడే స్మృతుల సమాహారం.

- వసుంధర