-
-
మనీ అండ్ బుల్లెట్స్
Money And Bullets
Author: Adapa Chiranjeevi
Publisher: Sri Krishnadevaraya Publications
Pages: 71Language: Telugu
“బాస్.. పార్కర్ డ్రీమ్లాండ్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మా ఎదురుగా వున్నవాడు జాకాల్ అని సందేహంగా వుంది!” అన్నాడు నున్నగా గుండు గీసుకున్న ఓ అనుచరుడు. “బాబు తాగుతున్న సిగరెట్ కూడా అదే బ్రాండ్!”
ఫోన్లోంచి ముత్తురామన్ నవ్వు గరగరా వినిపించింది. “ఒరే తంబి! మావాడు తన ప్రియురాలు బుల్బుల్ దగ్గర ఉన్నాడని ఇప్పుడే కబురొచ్చింది. ఇంకేమీ ఆలోచించకండి. కిల్ హిమ్ క్విక్!" అని అరిచాడు.
అంతే... ఆ నలుగురు దుండగులు రివాల్వర్స్ గురిపెట్టి, సూరిపండుని షూట్ చేశారు. ఆ వీధంతా బుల్లెట్ శబ్దాలతో ప్రతిధ్వనించింది.
వరసగా దూసుకొచ్చిన తూటాలు అతడి ఛాతీని, వెన్నుని తాకాయి. ముత్తురామన్ అనుచరుడు గుండుగాడి సెల్ మోగింది. వాడు ఫోన్ ఎత్తాడు. “బాస్... మీరు చెప్పినట్టే వాణ్ణి చంపి పారేశాం! వాడి శరీరంలోకి ఎన్ని బుల్లెట్లు దిగాయో చెప్పడం కష్టం...." అన్నాడు.
చదవడం మొదలుపెడితే ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టం!
సస్పెన్స్ గుర్రాలను మెరుపు వేగంతో పరుగులు తీయించే అడపా చిరంజీవి డిటెక్టివ్ నవల!
మనీ అండ్ బుల్లెట్స్
చిరంజీవి గారు మీరు చింతాకంత నా కార్టున్ ని తీసుకుని అరిటాకంత నవల రాసేశారు. చదివాక రాస్తున్నాను... సింప్లీ సూపర్బ్.. చదువు తున్నంత సేపూ ఓ ద్రిల్లింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. జోగారావు గ్యాంగ్ హీరో సూరిపండు కోసం వెతుకుతున్నప్పుడు జరిగే సన్నివేశాలు కడుపుబ్బా నవించాయి... సూరి పండు పది రూపాయల సమస్య నుండి బయటపడం కోసం లక్ష రూపాయల సనస్యను కొని తెచ్చుకున్నప్పుడు నవ్వొస్తుంది. ఈ నవల చదువుతున్నప్పుడు మనం ఊహించి నట్టు ఉండకుండా ఇన్నోవేటివ్ గా వుండి మనల్ని ఆశ్యర్యపోయేట్టు చేస్తుంది.
నాలాగే ఈ నవల నచ్చిన నిర్మాత దొరకగానే సినిమా రూపంలో మీ ముందుకు వస్తుంది.
ఆసక్తికరంగా మొదలైన " మనీ అండ్ బుల్లెట్స్ " నవల చదవడం మొదలుపెట్టిన నాకు మధ్యలో ఆపడం సాధ్యం కాలేదు. ఉత్సుకత రేకెత్తించేలా చదివించే గుణం రచయిత స్వంతం. అడపా చిరంజీవి నవలల్లో కనిపించే వేగం వూహకందదు. కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఆపుతామో మనకే తెలియదు. ఆపాలని తెలిసేసరికి నవల చదవడం పూర్తవుతుంది. అది రచయిత వేగం. అందుకే చిరంజీవి రచనలు అన్నీ చదవాలనిపిస్తుంది. నవల ప్రారంభంలోనే సెంట్రల్ ఐడియాను కూడా చూచాయగా చెప్పినప్పటికీ ఎక్కడా పట్టు సడలకుండా, సస్పెన్స్ వీడకుండా పాఠకులకు ఉత్కంఠ కలిగించే విధంగా రాయడం అడపా చిరంజీవి స్టైల్. మనీ అండ్ బుల్లెట్స్ చిట్టచివరి వరకు అసలేం జరుగుతుందో తెలియకుండా ఉర్రూతలూగించిన నవల .
విజయార్కె