• Mohana Smruti - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • మోహన స్మృతి (free)

    Mohana Smruti - free

    Publisher: Mohan Reddy Mitrulu

    Pages: 100
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది మోహన్‌రెడ్డి కథ. విశ్వవరం మోహనరెడ్డి మిత్రులు తమ జ్ఞాపకాలతో చెప్పిన జీవితకథ. 1954-2017 మధ్యకాలంలో తెలుగుసమాజంలో జీవించిన మోహన్‌రెడ్డి ఎవరు? ప్రజామేధావా? పర్యావరణవేత్తా? రాజకీయ అర్థశాస్త్రవేత్తా? కమ్యూనిస్టు విప్లవకారుడా? బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆ అసాధారణ మేధావిలో ఇవన్నీ ఉన్నాయి.

మోహన్ తెలుగునాట విప్లవ విద్యార్ధి సాధ్యమవైతాళికులలో ఒకడు. రాష్ట్ర వ్యాపిత విప్లవ విద్యార్థి సంఘాలేవీ ఏర్పడకముందే కోదాడ కళాశాలలో చదువుకుంటూ తన మిత్రులతో కలిసి పి.ఎస్.యు. ని ఏర్పాటుచేసి విప్లవవిద్యార్థి ఉద్యమాన్ని నిర్మించాడు.

భారత ఉపఖండం ఒక నయా వలస అని, సామ్రాజ్యవాదానికీ, వివిధ జాతులకు మధ్యవున్న వైరుధ్యమే ఇక్కడ ప్రధాన వైరుధ్యమని సూత్రీకరించాడు. సామ్రాజ్యవాద వ్యతిరేక కులనిర్మూలనా జాతి విముక్తి పోరాటాన్ని కార్మికవర్గం నాయకత్వంలో నిర్మించాలని ప్రతిపాదించాడు.

విప్లవం ప్రజల జన్మహక్కని చాటాడు. స్త్రీలకు తమ శరీరాలపై సార్వభౌమాధికార హక్కు వుందని, అది అనుల్లంఘనీయమని చెప్పాడు. మగపెత్తనంపై దాడిచేస్తూ స్త్రీవిముక్తి ఉద్యమాన్ని నిర్మించాలని పేర్కొన్నాడు.

హరిత విప్లవం ఫలితంగా దేశం ఎడారీకరణకు గురైందని, వర్షాలు అడవులకు వలసపోయాయని, రైతుల ఆత్మహత్యలన్నీ 'క్లైమేట్ ఛేంజ్ డెత్' లేనని సూత్రీకరించాడు. హరితహారాల వలన ఉపయోగంవుండదని, కొండలచుట్టూ దట్టమైన అడవులను పెంచితే వరాలు తిరిగివస్తాయని చెప్పాడు. భూమికి నీటిని తాపించు అనే నినాదాన్ని తీసుకువచ్చాడు.

ప్రకటించుకున్న ప్రాపంచిక దృక్పధానికి, జీవిస్తున్న తీరుకీ మధ్య అతి తక్కువ వైరుధ్యం సాధించిన అతి కొద్దిమంది కమ్యూనిస్టులలో మోహన్ ఒక్కడు.

భవిష్యత్తు అతన్ని ధృవీకరిస్తుంది. చరిత్రలో అతని స్థానాన్ని పదిలం చేస్తుంది.

- మోహన్‌రెడ్డి మిత్రులు