• Modati Taram Rayalaseema Kathalu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మొదటి తరం రాయలసీమ కథలు (1882-1944)

    Modati Taram Rayalaseema Kathalu

    Pages: 240
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మొదటితరం రాయలసీమ కథలు (1882-1944)

సంపాదకత్వం: డా॥అప్పిరెడ్డి హరినాథరెడ్డి

* * *

భారతీయులకు శాస్త్రీయ పరిశోధనలపట్ల ఆసక్తి తక్కువ అన్న అపప్రథ ఉంది. వైజ్ఞానిక దృష్టి తక్కువ అన్న ఆరోపణా ఉంది. దీనికి తోడు పలు కారణాలవల్ల పరిశోధకులంతా ‘నలుగురితోపాటు నారాయణ’ అన్న రీతిలో ఒకరు పయనించిన దారిలోనే మరొకరు పయనిస్తూ ఒకరు చూపిన పొరపాటు దారినే అనుసరిస్తూ పొరపాటునూ అలవాటుచేసి, రాచబాటగా మలచటం పలు రంగాలలో కనిపిస్తూ ఉంది. తెలుగు కథ విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడిప్పుడు అత్యంత ఆసక్తి, ఉత్సాహము, సత్యశోధనానిరతి కల కొందరు యువపరిశోధకులు పూనుకుని అలవాటైన చూపును వదలి సరికొత్త దృష్టితో నూతన పంథాలో సత్యాన్వేషణ సాగిస్తున్నారు. పాత సత్యాలలోని అసత్యాన్ని నిరూపిస్తూ నూతన సత్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. అలాంటి సత్యావిష్కరణ ప్రయత్న ఫలితమైన ఈ చిన్ని పుస్తకాన్ని ‘మొదటితరం రాయలసీమకథలు’ పేరిట తెలుగు సాహిత్య ప్రపంచానికి మా కానుకగా ఉడుతాభక్తితో సవినయంగా సమర్పిస్తున్నాము. ఎంతో శ్రమకు, వ్యయప్రయాసాల కోర్చి పరిశోధన కావించి, ఆ పరిశోధన ఫలితాలను పుస్తక రూపంలో సాహిత్య లోకానికి అందించే అవకాశం అబ్జ క్రియేషన్స్‌కు కలిగించిన డా॥అప్పిరెడ్డి హరినాథరెడ్డిగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

తెలుగు సాహిత్య ప్రపంచంలో తెలుగు కథ ప్రసక్తి వచ్చినప్పుడల్లా ఈ పుస్తకం పేరు వినపడక తప్పదన్న విశ్వాసంతో, చారిత్రకంగా, సామాజికంగా, సాహిత్యపరంగా అత్యంత విలువైన పుస్తకాన్ని అందిస్తున్నందుకు గర్విస్తున్నాం. ఒక రచన విలువ అది ప్రచురితమైన కాలంకన్న, వందేళ్ళ తరువాత తెలుస్తుందంటారు. ఈ సంకలనంలోని కథలు వందేళ్ళ క్రితం నాటివైనా ఈనాటి సమకాలీన సామాజిక పరిస్థితులకూ వర్తిస్తూ కాలదోషం పట్ట కుండా నాటి తెలుగు సృజనాత్మక రచయితల ప్రతిభాపాటవాలకు అద్దం పడుతున్నాయి. ఈ రచనలు వెలువడే నాటికి ప్రాంతీయ సంకుచిత్వాలు, అస్తిత్వ లంపటాలు లేవు. అందువల్ల ఆయా కథలలో రచయితలు తమ చుట్టుపక్కల సమాజాన్నే చిత్రించినా ఈ కథలలో విశ్వజనీనత ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి.. తెలుగుదనం ఉట్టిపడుతుంటాయి. అకాడమీలు, యూనివర్సిటీలు చేయ విస్మరించిన సాహిత్య పరిశోధనలకు ప్రోత్సాహమిస్తూ, సాహితీ విరూపాక్షుడు విద్వాన్‌ విశ్వం, జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు వంటి విలువైన పుస్తకాల తరువాత అబ్జ క్రియేషన్స్‌ అందిస్తున్న మరో విలువైన సాహిత్య మణిమాల ఈ పుస్తకం.

- కోడీహళ్లి మురళీమోహన్‌

Preview download free pdf of this Telugu book is available at Modati Taram Rayalaseema Kathalu
Comment(s) ...

http://pustakam.net/?p=18659

మన తెలంగాణ హరివిల్లులో సమీక్ష http://epaper.manatelangana.org/PUBLICATIONS/HARIVILLU/HAR/2015/06/14/ArticleHtmls/14062015012006.shtml