• Misimi May 2011
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • మిసిమి మే 2011

    Misimi May 2011

    Author:

    Publisher: Bapanna Alapati

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సంప్రదాయంలో బుద్ధ జయంతి మూడు ప్రత్యేకతలను సంతరించుకుంది. సిద్ధార్థుడు వైశాఖ పూర్ణిమనాడే జన్మించాడు. ముప్పది అయిదేండ్ల తర్వాత ఉరువెల (ఇప్పటి గయ)లో నేరంజనానది ప్రక్కన బోధివృక్ష ఛాయలో సంబోధి ప్రాప్తమయింది. ఎనబదిఏండ్లకు అదే దినాన కుసినార (ఇప్పటి ఉత్తరప్రదేశ్) వనంలో మహాపరినిర్వాణం చెందాడు. థేరవాద బౌద్ధం ప్రకారం - బుద్ధుడు 2555 సంవత్సరాల క్రితం నిర్వాణం చెందాడని విశ్వసిస్తారు. మహాయాన సంప్రదాయ ప్రకారం బుద్ధుని పరినిర్వాణం క్రీ.పూ. 483 నాటికి లెక్కించబడింది. భారతదేశంలో ప్రచారంలో వున్న మూడు కాలమాన లెక్కల పద్ధతుల్లో బౌద్ధశకం పురాతనమైనది. మిగిలిన రెండు శాలివాహన, విక్రమనామ శకాలు.

ఈ నెల మిసిమి బుద్ధ జయంతి ప్రత్యేకం.

బౌద్ధ సంబంధమైన అనేక విషయాలపై వ్యాసాలు అందిస్తున్నాం. ముఖ్యంగా తెలుగువారి జీవనంతో వేయిసంవత్సరాలపైగా పెనవేసుకుని పోయిన విశ్వాసంగా పేరొందినది బౌద్ధధర్మం. దురదృష్టవశాత్తు అనేక కారణాలవలన (అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రామాణికంగా చూపినవి కొన్ని ఈ సంచికలోనే ఉన్నవి.) భారతదేశంలో బౌద్ధం క్షీణించి పొరుగుదేశాలకు వలస పోవలసి వచ్చింది. ఇందుకు దోహదం చేసినది - సాంఘీకంగా ప్రజలను కుల - వర్గాలుగా చీల్చిన శక్తులు మాత్రమే. ఈ ప్రమాణాలే ప్రజలను అస్పృశ్యులుగా, అంటరానివారిగా అణచి అవిద్యకు కారణమైనవి.

ఇప్పటికైనా మనం మేల్కొని ఈ అనైతికమైన మాయాజాలం నుంచి బైటపడి కులవిభజనల కుయుక్తులను అధిగమించి సాంఘీక పునర్వికాసం సాధించవలసి వుంది.

తెలుగునాట బౌద్ధధర్మ ప్రాశస్త్యాన్ని, చరిత్రను వీరనారాయణ రెడ్డి వ్యాసంలో విపులంగా వివరించారు.

ఆచార్య నరేంద్రదేవ్ వ్రాసిన 'బౌద్ధధర్మ దర్శన్' బృహద్గరంథాన్ని సవివరంగా సమీక్షించిన సంజీవదేవ్, బౌద్ధధర్మ చరిత్రను సంక్షిప్తంగా మన కళ్ళ ముందుంచారు.

'త్రిరత్న వందనం' మన కందించినవారు బొర్రా గోవర్ధన్. వీరి బౌద్ధ సాహిత్యానువాదాలు ఇటీవలనే వెలుగులోకి వస్తున్నాయి. 'ధర్మచేతన' కవిత - తియ్యగూర సీతారామి రెడ్డి ఎంతో ఆర్తితో వ్రాశారు.

బుద్ధఘోషుని 'విపశ్యన - మనోవిశ్లేషణ' ఫ్రాయిడ్ మనోవిజ్ఞానిక సిద్ధాంతాలకు, బౌద్ధములోని ధ్యాన ప్రక్రియలకు వున్న సంబంధాలను, ఇప్పటికీ అనుసరణీయమైన ప్రాధాన్యతను వివరిస్తోంది.

చంద్రశేఖర్, బుద్ధుని జీవితాన్ని నిశ్శబ్ద విప్లవంగా వర్ణించారు. భదంత ఆనంద కౌసల్యాయన్ - భారతదేశంలోని కులవ్యవస్థలను, సాంఘీక దురాచారాలను సహేతుకంగా గర్హించారు.

ఎన్నో వ్యాసాలు - లబ్ధ ప్రతిష్ఠులు వ్రాసినవే - చోటు లేకపోవటమనే ఒకే కారణంతో ప్రచురించలేక పోతున్నాం. వీలుకల్పించుకొని మునుముందు అందించగలమని మనవి చేస్తూ...

- సంపాదకులు

Preview download free pdf of this Telugu book is available at Misimi May 2011