• Misimi Feb 2011
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • మిసిమి - ఫిబ్రవరి 2011

    Misimi Feb 2011

    Author:

    Publisher: Bapanna Alapati

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఉరుకుల పరుగుల కాలంలో ఎన్నో మార్పులు. కొత్త సాధనాలన్నీ అరచేతిలో వైకుంఠం చూపుతున్నాయి. ఈ జీవన విధానంలో వాడుక భాషలో కూడా ఎన్నో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియలో ఎన్నో పదాలు వినమరుగవుతున్నాయి. ఇది ఈనాటి సమస్యకాదు - అన్నమయ్య పదాలు, పదబంధాలు అర్థంకాని కాలంలోని వచ్చేశాం. తిక్కన వాడిన సమకాలీన, ప్రాంతీయ ప్రయోగాలు తెలియజెప్పే నిఘంటువుల కోసం వెతుక్కుంటున్నాము. ఇది ఇలా జరగవలసిందేనా? వృత్తిపరమైన పదానలు, ప్రాంతీయ పరిభాషను, వ్యవసాయ సంకేత పదాలను పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ దిశగా అందరూ కృషి చేయవలసిందే.

అయిదకోట్ల సంవత్సరాల నాటి ప్రాగ్రూప మానవుని మెదడు బరువు ఒక పౌను. ఇప్పటి మనిషి మెదడు దానికి మూడురెట్లు ఎక్కువ. ఈ సుదీర్ఘ కాలంలో మానవేతిహాసంలో - ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకునే దిశలో మానవుడు అదిరోహించిన సోపానాలు అనేకం. ఆ వివరాలు పరిశోధించి ప్రపంచానికి అందించిన బ్రోనొస్కి 'ఎసెంట్ ఆఫ్ మాన్' గ్రంథంలో ముఖ్యభాగాలను మిసిమి పాఠకులకోసం ముక్తవరం పార్థసారథి అందిస్తున్నారు.

జానపద సాహిత్యాన్ని వెతికి వెలికితెచ్చి పల్లకీ ఎక్కించినవారు బిరుదురాజు రామరాజు. వారి 'పరిణితవాణి'ని విని తీరవలసిందే.

కొంకణి భాషలో జ్ఞానపీఠ పురస్కారం పొందిన మొదటి వ్యక్తి రవీంద్ర కేలేకర్. ప్రపంచ సాహిత్యంలో మనం మరుగుజ్జులుగా మిగిలిపోరాదని ప్రబోధించే వీరి ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకం.

అగ్రరాజ్యాల అహంకారాన్ని అబద్ధాలను - అనవసరపు యుద్ధాలను ఎండగట్టిన 'హెరాల్డ్ పింటర్' నోబెల్ ప్రసంగం అందరినీ ఆలోచింపజేస్తుంది.

ఈ నెల 11వ తేదీ ఆలపాటి రవీంద్రనాథ్ 15వ వర్ధంతి. ఆయన స్మృతికి నీరాజనం.

- సంపాదకులు

Preview download free pdf of this Telugu book is available at Misimi Feb 2011