• Merunagadheerudu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 140.4
    156
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మేరునగధీరుడు

    Merunagadheerudu

    Author:

    Publisher: Virinchi

    Pages: 208
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


విరించి కలము నుండి జాలువారిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడి క్రీడా జీవిత విశేషాల సమాహారం మేరునగధీరుడు అనే గ్రంథ సుమం.


పదహారేళ్ళ వయసులో పాలుకారే బుగ్గలతో సరిగ్గా ఐదున్నర అడుగుల ఎత్తు కూడా లేని ఓ సామాన్య కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టిన నాడు ఏదో కాకతాళీయంగా వచ్చాడనుకున్నారెందరో, వాళ్ళనుకున్న ప్రకారమే సచిన్ క్రీడా జీవితం ఆహా ఓహో అనే స్థాయిలో ఆరంభం కాలేదు.


తొలి శతకాన్ని సాధించాక వెనుతిరిగి చూడలేదు. వంద శతకాలు ఒకవంకా, అరవై మూడు అర్థ శతకాలతో కలిపి మొత్తం ముప్పైనాలుగు వేలకు పై చిలుకు పరుగులని వెల్లువెత్తించి ఈ దరిదాపు రోజుల్లో ఎవరూ చేరుకోనంత ఎత్తుకెదిగినవాడు సచిన్ టెండూల్కర్.


ఒక మానవతా వాది
ఒక ప్రేమ మూర్తి
ఒక నిగర్వి
ఒక నిరాడంబరుడు
ఒక అచంచల దేశభక్తుడు
ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం మూర్తీభవించిన మహా మనిషి


అతని క్రీడా జీవితమేమి వడ్డించిన విస్తరి కాదు,ఎన్నో ఒడుదుడుకులు ఎన్నెన్నో విమర్శలు ఇంకెన్నో అవమానాలు అయినా చెక్కు చెదరని మనస్తత్వం, ఒక గెలుపు అతనిలో అహంకారాన్ని పెంచలేదు . ఒక ఓటమి అతన్ని కృంగదీయలేదు, అలాంటి స్థిత ప్రజ్ఞత కలిగిన వాడు.


ఒక ఓటమి అతనిలో పట్టుదలని పెంచింది విజయానికి మార్గం చూపింది.


ఈనాటి యువతరానికి మార్గదర్శనం చేసే ఒక గొప్ప గ్రంథం.
ఎవరైనా తానెన్నుకున్న రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరుకోవడానికి కావలసిన స్ఫూర్తి నిచ్చే గ్రంథమిది.


భారత అత్యున్నత పురస్కారం భారతరత్న సాధించిన మొట్టమొదటి క్రీడాకారుడు సచిన్.


అలాంటి సచిన్ కు క్రికెట్ పట్ల మోజెలా కలిగింది, అతని ఆటలో నైపుణ్యానికి ఎవరెవరు ఎలాంటి సూచనలిచ్చారు, బాల సచిన్ ఎలా ఉండేవాడు. ప్రపంచకప్ విశేషాలతో పాటు తేనె లొలుకు తెలుగులో తీయనైన వంద ఆటవెలదులతో సచిన్ క్రీడా జీవనాన్ని విరించి అద్భుతంగా వర్ణించారు.


మొట్టమొదట తెలుగులో వచ్చిన సచిన్ జీవిత క్రీడా జీవిత విశేషాల సమాహారం

Preview download free pdf of this Telugu book is available at Merunagadheerudu
Comment(s) ...

its really superb.... an exellent book in telugu........ thanq sir.....