• Menarikam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 102
    120
    15% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మేనరికం

    Menarikam

    Publisher: Palapitta Books

    Pages: 204
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మేనరికం - మరికొన్ని నాటకాలు

మానవ స్వభావ చిత్రణ

సామాజిక జీవితంలో సాధారణంగా కనిపించే అంశాల్లోని లోతునీ, తీవ్రతనీ చర్చిస్తూ ఉత్తమమైన నాటకాలను రాశారు ఒద్దిరాజు సోదరులు. వారు రాసిన నాటకాల్ని మూడు భాగాలుగా చేసి మూడు పుస్తకాలుగా అందిస్తున్నాం. వాటిల్లో ఒకటి మగసంసారం. రెండోది 'మేనరికం' మరికొన్ని నాటకాలు. దీనిలో మేనరికం, ఆడపెత్తనం, మేనత్త, మైత్రి పరిణతి అనే నాటకాలున్నాయి.

మారిన సామాజిక సంబంధాల నేపథ్యంలో మేనరికం చేసుకోడాన్ని ఈ తరంలో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. కానీ అరవై ఏళ్ల కిందటి వరకు మేనరికం ఉంటే ఆ సంబంధాన్ని చేసుకోవడం తెలుగువారి సంప్రదాయాల్లో ప్రముఖమైనది. మేనరికం ఉండంగా మరో సంబంధాన్ని వెదుక్కోడం చాలా అవమానంగా భావించేవారు. తమకు ఏం తక్కువైందని మరో పెళ్ళి సంబంధం వెతుక్కుంటున్నారని నిష్టూరాలాడేవారు. కేవలం డబ్బు ఆశ, కట్నం ఎక్కువ వస్తుందన్న ఆరాటం కారణంగా మేనరికాన్ని కాదనుకునేవారు. డబ్బు కోసం అయిన వాళ్ళను, తమ దగ్గరివాళ్ళ సంబంధాల్ని వదులుకోడం వివేకం కాదన్న అభిప్రాయాలుండేవి. ఈ అంశాల చుట్టూరా తిరుగాడుతూ రూపొందించిన నాటకమే 'మేనరికం'.

మరో కోణంలోంచి 'మేనత్త' నాటకం ఆసక్తికరంగా రూపొందింది. 'ఆడపెత్తనం' అనే నాటకం మనుషుల స్వాభావిక నైజాన్ని చర్చకు పెట్టింది. 'మైత్రి పరిణతి' మరో విశిష్ట నాటకం. ఈ నాలుగు నాటకాల సముదాయమే ఈ పుస్తకం.

ప్రదర్శనాయోగ్యమే కాదు, పఠన యోగ్యమైన నాటకాలివి. సరళమైన సంభాషణల శైలి వల్ల నాటకాలు రక్తి కడతాయి. దేశ స్వాతంత్ర్యానికి పూర్వమే ఈ నాటకాలు రాశారు ఒద్దిరాజు సోదరులు. ఆ కాలంలో సమాజాన్ని వేధిస్తున్న అనేకానేక సమస్యలే ఈ నాటకాలకు ఇతివృత్తాలయ్యాయి. అరవై సంవత్సరాల కిందటి పరిస్థితులలో పెద్దగా మార్పు లేదు. ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు ఈ నాటకాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వీటిని అధ్యయనం చేయడం పాఠకులకే కాదు, రచయితలకు కూడా ఉపయుక్తం.

- పాలపిట్ట బుక్స్

Preview download free pdf of this Telugu book is available at Menarikam