• Melakuva
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మెలకువ

    Melakuva

    Author:

    Publisher: Navodaya Publishers

    Pages: 120
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒక సృజనకారుని లోతైన అధ్యయానికి దాఖలాలు ఎక్కడ దొరుకుతాయంటే, ఆమె రచనల్లోనే - గిడసబారిపోకుండా గడ్డకట్టిపోకుండా, జడప్రాయ యాంత్రిక రచనా విధానాన్నుంచి నిన్ను రక్షించేంది అధ్యయన, అన్వయాలే. ఒక మహత్తరమైన సాహిత్య రచన - అది నవల కావచ్చు, కవిత్వం కావచ్చు - నీ జీవితానికి అన్వయించుకుంటూ చదివితే - అది నీ ఆలోచనా విధానాన్ని, సృజనశక్తినీ విశాలం చేస్తుంది. Multi-Dimentaional చేస్తుంది. ఒక గాడిలో ఇరుక్కుపోకుండా విస్తరించడమెలాగో - జీవనానుభవ లోతుల్లోకి ఎలా వెళ్ళాలో అది నేర్పుతుంది. జీవితాన్ని అన్ని పార్శ్వాలలోనూ - దాని సర్వ అంశాలతోనూ, సర్వ కోణాల్లోనూ ఎలా పట్టుకోవాలో, కళామయం చెయ్యాలో నేర్పుతుంది. వీటన్నింటిని సత్యవతి గారు చాలా అనాయాసంగా పట్టుకున్నారన్నంతగా చదివారని ఆమె కథలు చెబుతాయి.

తొందరపాటు లేకుండా, తన ప్రాపంచిక దృక్పథాన్నుండి జీవితాన్ని - చుట్టూ వున్న అన్ని రకాల మనుషుల్ని, వారి అనుభవాల్ని విశ్లేషించుకుంటూ, వాస్తవాన్ని జీవిత వాస్తవాన్ని - అసలు సత్యాన్ని, రూపాన్ని చెప్పడంలో కళామూలాలు దెబ్బతినకుండా కథలు వ్రాయడంలో సత్యవతిగారు విజయం సాధించారు. రచయిత ఎదిగే క్రమంలో తొందరపాటు లేకుండా ఆబగా మింగడం కాకుండా - నెమ్మదిగా కదులుతూ, నెమరు వేసుకుంటూ, ఒక పాత్ర ద్వారా, ఒక జీవితం ద్వారా మొత్తం సమాజాన్ని దాని పోకడలను, విడమర్చడం, విశ్లేషించడం - 'ఒహో ఈమె చెప్పింది కరక్టే! నిజమే- ఇంతకు ముందు నాకు తట్టలేదు' అని పాఠకుడికి అనిపించేలా రచన చెయ్యడం గొప్ప కష్టం. దానికి ఒక మగ్నత, కళోన్నీలనం అవసరం. సత్యవతిగారు ఆ లోతుల్లోకి వెళ్ళారని ఆమె కథలు చెబుతాయి.

- కె. శివారెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Melakuva