• Meherbaba Avataratatvam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మెహెర్‌బాబా అవతారతత్వం

    Meherbaba Avataratatvam

    Author:

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మెహెర్‌ బాబా భారతదేశంలోని పూనా పట్టణంలో 1894లో జన్మించారు, వారి తల్లిదండ్రులు జొరాస్ట్రియన్‌ మతస్థులు. తండ్రి మొదట్లో భగవత్‌ సాక్షాత్కారం కోసం అనేకమైన కఠినమైన నియామలు ఆచరించాడు. ఆప్పుడు అతనికి నిద్రలో ఒక వాణి వినిపించింది. ''నీవు దేని కొరకైతే వెదుకుతున్నావో అది నీకు లభించే యోగ్యత నీకు రాసి పెట్టిలేదు. కాని నీకు పుట్టే కొడుకు దాన్ని సాధిస్తాడు'' అని.

* * *

ఒకరోజు మెహెర్‌ బాబా వారి శిష్యులకు 1925 జూలై 10 నుండి తాను మౌనం పాటిస్తాను అని చెప్పారు. ఆ మౌనాన్ని వారు జీవితం చివరి దాకా పాటించారు. అయినప్పటికీ ఆ 44 ఏళ్ళ మౌనజీవనంలో వారు ఎంతో కృషి చేశారు.

* * *

ఒక సమయంలో బాబా సందేశాన్ని వ్యాప్తి చేయటానికి ప్రయత్నించే వారు కొందరు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయేవారు. ''మెహెర్‌బాబా ఎవరు?'' అనేది అ ప్రశ్న. అలా అడిగిన వారికి వారు ''బాబా మానవరూపంలో వున్న భగవంతుడు''. అనీ, ''బాబా అవతార పురుషుడు'' అనీ, ''బాబా ఉన్నతోన్నతుడు'', అనీ పలువిధాలుగా సమాధానం చెప్పేవారు. కాని వీటిలో ఏ ఒక్క సమాధానం ప్రశ్న అడిగిన వారిని సంతృప్తి పరచలేకపోయేది. అపుడు వారు బాబాను అడిగారు, తాము ఏమని చెప్పాలి? అని. దానికి బాబా చెప్పారు. ''వారితో చెప్పండి, ఆ ప్రశ్నను వారిలో ప్రేరేపించిన వాడిని నేనే. అన్నిటిలోను వున్న మూలతత్వాన్ని.''

* * *

అన్ని రకాల చిలుక పలుకలు కట్టిపెట్టండి. దేన్నైతే మీరు సత్యమని న్యాయమని నమ్ముతారో దాన్ని ఆచరించండి. మీ విశ్వాసాల్ని, నమ్మకాల్ని ప్రదర్శనకు పెట్టవద్దు. మీ మతాన్ని మీరు వదులుకోవలిసిన పనిలేదు. కానీ కేవలం ఆచార వ్యవహారాలు, కర్మకాండ అనే పై పొట్టును పట్టుకొని వేళ్ళాడడం మానుకోండి. అన్ని మతాలకు అంతస్సూత్రంగా వుండే ఏకైక సత్యాన్ని గ్రహించటానికి మతాన్ని దాటి వెళ్ళండి.

- మెహెర్‌బాబా

Preview download free pdf of this Telugu book is available at Meherbaba Avataratatvam