• Meghamala
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మేఘమాల

    Meghamala

    Author:

    Pages: 176
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"మేఘమాల" నవల 23-01-1970 నుండి 10-04-1970 వరకు ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడినది.

* * *

త్యాగరాజు బిగుసుకుపోయి నిలబడ్డాడు.

రాజేశ్వరి!

రాజేశ్వరి ఇక్కడికెలా వచ్చింది?

"అదేఁవిటి... అలా బొమ్మలా నిల్చుండిపోయారు?... నేను రాజేశ్వరిని!" అన్నది నవ్వుతూ.

కళ్ళు రెపరెపలాడించి, ముందుకు త్వరత్వరగా అడుగులు వేస్తూ, "ఎప్పుడొచ్చావు?" అన్నాడు.

- ఒక విధంగా, అంతరంగంలో ఆవిడ రాక అతడికి ఈ సమయంలో ఉపశాంతే కలిగిస్తోంది.

కాని - రాజేశ్వరి వెనుకగా నిలబది వున్న రాణి, శకుంతలలు అతడికి చికాకు కలిగిస్తున్నారు!

"నేను ఈ ఊరు ఉదయాన వచ్చాను.. ఇక మేం ముగ్గురం ఇక్కడకు వచ్చేటప్పటైకి మధ్యాహ్నం మూడు గంట లయింది... అప్పటిబట్టి మీ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నాం!"

రాణి సత్యవతిని చూస్తూనే చిరునవ్వుతో, "సత్యవతీ!" అంటూ ఆమె పక్కకు వచ్చి చేయి పట్టుకున్నది.

రాణి, శకుంతలా అక్కడ తన గదికి రావటం అతనికే మాత్రం ఇష్టంలేదు!

Preview download free pdf of this Telugu book is available at Meghamala