-
-
మీలా నేనెందుకు ప్రేమించాలి?
Meela Nenenduku Preminchali
Author: Suryadevara Rammohana Rao
Publisher: Model Publications
Pages: 197Language: Telugu
ఎగిరి అవతలపడ్డాడు. స్ప్రింగ్‌లా పైకి లేచింది. మొదటివాడ్ని ఎగిరితన్నింది పక్కటెముకలమీద. కెవ్వున అరుస్తూ పాత సామాన్ల మీద పడ్డాడు. దాంతో రెండోవాడు కత్తిని ఝళిపించాడు. ఆమె మొదటివాడ్ని పడగొట్టడంతోనే రెండోవాడు విసిరిన కత్తిని కంటికొసన గమనించి తిప్పుకునేలోగా ఆమె భుజాన్ని కత్తి చీరేసింది. చివ్వున పొంగింది రక్తం. దాంతో వాడి చేతిని గాల్లోనే బ్లాక్‌చేసి కత్తిని అందుకుని సూటిగా వాడి గుండెల్లోకి దింపేస్తుంది. కెవ్వున అరుస్తూ నేలకొరిగాడు. వాడి ప్రాణాలు ఎగిరిపోయాయి.
దాంతో మొదటివాడు ఠారెత్తిపోయాడు. ఆ కత్తిని అలాగే లాగి వాడి గొంతుమీదకి విసిరింది. గింగిరాలు తిరుగుతూ దూసుకెళ్ళిన కత్తి వాడి గుండెల్లో నాటుకుంది. చివ్వున గుండెలనుండి రక్తం పొంగుతుండగా ప్రాణాలు వదిలాడు. చుట్టూ చూస్తూ చేతి బ్లౌజ్‌ని సరిచేసుకుంది. భుజం నుంచి రక్తం స్రవిస్తోంది. అటూ ఇటూ చూసి అక్కడ పడివున్న బ్రాందీ బాటిల్‌ని అందుకుని మూత తెరిచి భుజమ్మీద గాయం పైన ఒంపింది. జేబు రుమాలుతో బిగించి కట్టింది రక్తం పోకుండా.
బాగుంది..