• Mee Startup Nu Ila Gelipinchandi
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 324
    360
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మీ స్టార్ట‌ప్‌ను ఇలా గెలిపించండి!

    Mee Startup Nu Ila Gelipinchandi

    Author:

    Publisher: VMRG International

    Pages: 210
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఈరోజు స్టార్టప్‌ ఒక అందమైన కల. సొంత శక్తి సామర్థ్యాలను పెట్టుబడిగా పెట్టి, తమకు నచ్చిన రీతిలో బతకడానికి స్టార్టప్‌లు అవకాశం కల్పిస్తాయనే ఆశలు ఈరోజు కొత్తతరం యువతీయువకుల్లో బాగా కనిపిస్తున్నాయి. అందుకు ప్రోత్సహిం చేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వారికి అందుబాటులోకి వస్తోంది. విశ్వవ్యాప్తంగా ఎదిగే అవకాశాలు పెరుగుతున్నాయి. దీంతో సొంత వ్యాపారాల సంఖ్య గతంలో కంటే ఈరోజు అనేక రెట్లు పెరిగింది. చదువులు పూర్తిచేసుకుని కెరియర్‌ ప్రపంచం లోకి అడుగుపెడుతున్నవారిలో ఎక్కువమంది సొంతవ్యాపారాల వైపే మొగ్గు చూపే స్థాయికి చేరింది.

అయితే, ఈ స్టార్టప్‌ కలల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇవన్నీ కలలేనా? లేక నిజంగానే ఉపయోగపడేవా? ఎలా తేల్చుకోవాలి? స్టార్టప్‌ల మాయలో పడొద్దని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు చేస్తున్న సూచనలను ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవైపు వందలాదిగా స్టార్టప్‌లు మూతపడుతుంటే, మరోవైపు వేలాదిగా ఎలా పుట్టుకొస్తున్నాయి? ఇందుకు కారణం ఎంట్రప్రెన్యూర్ల అవగాహనా లోపమా? లేక ఇంకేదైనానా? వీటివెనుక వున్న వాస్తవాలను ఎలా పట్టుకోవడం?

ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరికితే స్టార్టప్‌ల ఏర్పాటు చాలా సులభతరమవుతుంది. అయితే, ఈ సమాధానాలు అందరికీ ఒకేలా వుంటాయా? ఒకే జవాబు లక్షలాదిమందికి ఒకే పద్ధతిలో ఎలా వర్తిస్తుంది? ఎవరి ఆలోచనలు, సామర్థ్యాలు, ప్రణాళికలు, పెట్టుబడులు, అంచనాలు, ఆశలు వారికుంటాయి కదా! ఇదీ నిజమే! అంటే ... ఎవరికి తగినట్లు వారు స్టార్టప్‌ అంచనాలను కస్టమైజ్‌ చేసుకోవాలని అర్థమవుతోంది కదా! ఈ కస్టమైజేషన్‌ ఎలా సాధ్యమవుతుంది? సరే, మీకు తగినట్లుగానే కస్టమైజ్‌ చేసుకుని, అన్నివిధాలా ఆలోచించాకే స్టార్టప్‌ ప్రారంభించారనుకోండి. అది నిలదొక్కుకునే అవకాశాలు ఎంతవరకూ వుంటాయి?

మీ స్టార్ట‌ప్‌ను ఇలా గెలిపించండి అనే ఈ పుస్త‌కం స్టార్ట‌ప్ ఔత్సాహికుల వంద‌లాది ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిస్తుంది. స్టార్టప్‌లను ప్రాథమికంగా అర్థం చేసుకోవాలంటే ముందు అనేక వాస్తవాలను మీకు తెలియ‌జేస్తుంది.

వ‌ర్క్‌ప్లేస్ మేనేజ్‌మెంట్ అంశాల నిపుణుడు సురేశ్ వెలుగూరి ఈ పుస్త‌కాన్ని మీముందుకు తీసుకువ‌చ్చారు. స్టార్ట‌ప్ మేనేజ్‌మెంట్ అంశాల‌పై తెలుగులో ఇదే మొట్ట‌మొద‌టి పుస్త‌కం.

Preview download free pdf of this Telugu book is available at Mee Startup Nu Ila Gelipinchandi