• Medadu Charitra
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మెదడు చరిత్ర

    Medadu Charitra

    Publisher: Manchi Pustakam

    Pages: 44
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఇరవయ్యొకటవ శతాబ్దంలో సైన్స్‌ విభాగాలన్నిటిలోకి న్యూరోసైన్స్‌ ఓ విశిష్ట స్థానాన్ని ఆక్రమిస్తోంది. సాంకేతిక రంగంలో సాధించిన పురోగతి కారణంగా మెదడు గురించిన అవగాహన నానాటికి పెరుగుతోంది. మునుపు ఎన్నడూ సాధ్యం కాని స్థాయిలో మెదడు సమస్యలకి చికిత్స చేసే అవకాశాలు ఏర్పడుతున్నాయి. అయితే మెదడు పరిజ్ఞానం ఇలాంటి ఉన్నత స్థితిని ఎలా చేరుకుంది?

మెదడు గురించి (మెదడుని ఉపయోగించి!) మనిషి ఆలోచన ప్రారంభించి కొన్ని సహస్రాబ్దాలు అవుతోంది. ఆ ప్రయత్నంలో తొలి దశలలో మనిషి మెదడు గురించి ఎన్నో తప్పుడు భావాలు ఉండేవి. వైజ్ఞానిక సాక్ష్యాధారాలు పోగు అవుతున్న కొద్దీ ఆ అపోహలు తొలగిపోయాయి.

తొలి దశలలో మెదడులో ఏవో అదృశ్య శక్తులు నాడుల ద్వారా ప్రవహించి చలనాన్ని కలిగించేవి అనుకునేవారు. అయితే మెదు వల్ల కలిగే ప్రభావాలన్నిటికీ కారణం విద్యుత్‌ రసాయన చర్యలేనని మనకిప్పుడు తెలుసు. తొలి దశలలో కపాల ఉపరితల విశేషాల బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని చెప్పొచ్చు అనుకునేవారు. అయితే అదొక అవైజ్ఞానిక భావన అని, అందుకు సాక్ష్యాధారాలు లేవని ప్రస్తుతం మనకి తెలుసు.

భౌతిక, రసాయనిక, గణిత, వైద్య రంగాల్లో జరిగిన అభ్యున్నతి కారణంగా ఎన్నో అపోహలు తొలగి, మెదడు గురించి ప్రస్తుతం ఎంతో లోతైన అవగాహన ఏర్పడింది. మెదడు గురించి ఏమీ తెలియని నాటి నుండి ప్రస్తుత స్థితికి ఎలా వచ్చాం?

అదే ఈ '' మెదడు చరిత్ర''.

- డా|| వి. శ్రీనివాస చక్రవర్తి

Preview download free pdf of this Telugu book is available at Medadu Charitra