• May Day
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మేడే

    May Day

    Publisher: Pet Publications

    Pages: 42
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మే డే కార్మికుల హక్కుల దీక్షా దినం. ఇది అంతర్జాతీయ దినం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ ఐక్యంగా 'కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి' అని నినదించే దినం. మే 1న అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు ఎనిమిది గంటల పని దినం కోసం సమ్మె చేశారు. ఆ సందర్భంగా పెట్టుబడిదారుల గూండాలు విసిరిన బాంబుల దాడిలో కార్మికులు క్షతగాత్రులయ్యారు. కానీ కార్మికులదే తప్పని వారిపై కేసులు పెట్టారు. ఆఖరుకు వారిని ఉరి తీశారు. వారి పోరాటానికి గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా మే డేను కార్మికులు జరుపుకుంటారు.

***

2015 మేడే రోజున ‘కార్మికుల హక్కుల దీక్షాదినం మేడే’ పేరుతో ప్రచురించిన పుస్తకాన్ని మేడే సభలో ఆ రోజు సాయంత్రం అనంతపురంలో అవిష్కరింపజేశాను.

ఇప్పుడు మళ్లీ 'మేడే' పేరుతో e-Book ను విడుదల చేస్తున్నాను. ఇందులో పూర్తిగా నేను రాసిన వ్యాసాలు ఉన్నాయి. ప్రసిద్ధుల వ్యాసాల ఆధారంగా వీటిని రాసినాను.

కార్మికవర్గం తాము చేసే పోరాటం అర్థిక పోరాటంగా మొదట్లో అనిపించినా పోను పోనూ ఇది రాజ్యాధికారం దిశగా సాగుతుంది. కార్మికుల రాజ్యం ఆవిర్భవించిన రోజున సమాజంలో వున్న ఆర్థిక అసమానతలు పోతాయి. వర్ణవివక్షత పోయి కులరహిత, వర్గరహిత సమాజం ఏర్పడి సరికొత్త మానవీయ సమాజం అవిర్భవిస్తుంది.

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దోపిడిపోయి సమసమాజం నెలకొంటుంది. ఆ రోజు మన కళ్ళెదుట సాక్షాత్కరించాలంటే 'మేడే' స్ఫూర్తి నిరంతరంగా కార్మికుల్లో కొనసాగాలి. మేడే ఎనిమిది గంటల పని విధానం కోసమే కాదు, కార్మికులను సంఘటితపరచి హక్కుల కోసం ఎలుగెత్తిన రాజు కూడా భవిష్యత్తులో అది రాజ్యాధికారం అందుకొనే రోజుగా మారాలని కోరుతున్నా.

- పిళ్లా విజయ్

గమనిక: " మేడే " ఈబుక్ సైజు 5.6mb
Preview download free pdf of this Telugu book is available at May Day