• Marx Capital Parichayam 1
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మార్క్స్ ‘కాపిటల్’ పరిచయం-1

    Marx Capital Parichayam 1

    Author:

    Pages: 636
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

మానవులకు, 'మానవ సమాజం' గురించి తెలుసుకోడానికి మించిన జ్ఞానం వుండదు. ఆ జ్ఞానాన్ని ఇచ్చే శాస్త్రీయమైన గ్రంధం 'కాపిటల్‌' ఒక్కటే.

మానవ సమాజం సృష్టించుకున్న విజ్ఞాన సంపదల్లో - 19వ శతాబ్దపు జర్మన్‌ తత్వ శాస్త్రమూ, ఇంగ్లీషు ఆర్ధిక శాస్త్రమూ, ఫ్రెంచి సోషలిస్టు సిద్ధాంతమూ అత్యంత ప్రధానమైనవి. ఆ మూడింటి లోనూ వున్న అశాస్త్రీయ, భావవాద లక్షణాలను తొలగించి, వాటిని, పూర్తిగా శాస్త్రీయమైన పునాదుల మీద నిలబెట్టినదాని ఫలితమే - 'మార్క్స్ సిద్ధాంతం'! ఆ సిద్ధాంత జ్ఞానంతో మార్క్సు, 'ఇంగ్లండు పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థ'
గురించి చేసిన విమర్శనాత్మక పరిశీలనే - 'కాపిటల్‌' (పెట్టుబడి) పుస్తకం.

'కాపిటల్‌' ఆవిర్భావం మానవ సమాజ చరిత్రలో అత్యద్భుతమైన ఘటన. గత లక్షలాది సంవత్సరాలలో జరిగిన ఘటనలకన్నా అది భిన్నమైనది. ఎందుకంటే - మానవ ప్రపంచానికి దాస్య శృంఖలాల నించీ; 'దోపిడి' అనే అమానుషత్వం నించీ; జుగుప్సాకరమైన వర్గ భేదాల నించీ; కౄరాతి కౄరమైన యుద్ధాల నించీ; సంక్షోభాల నించీ; యుగ యుగాల దుఖ్ఖాల నించీ, కన్నీళ్ళ నించీ; జంతు స్థాయి హింస నించీ; అజ్ఞానం నుంచీ - శాశ్వతంగా విముక్తినిచ్చే మార్గాన్ని 'కాపిటల్‌' అనే జ్యోతి విస్పష్టంగా చూపించింది.

'ఆర్ధికశాస్త్రం' అంటే - అందులో చాలా లెక్కలు వుంటాయనీ, లెక్కలు బాగా తెలిసిన వాళ్ళు తప్ప దాన్ని చదవలేరనీ, సాధారణంగా మనందరికీ ఒక అభిప్రాయం వుంటుంది. అది చాలా పొరపాటు అభిప్రాయం. ఆర్ధిక శాస్త్రం అంటే, సమాజపు ఉత్పత్తి విధానాన్నీ, పంపిణీ విధానాన్నీ వివరించే శాస్త్రం. అందులో పెద్ద పెద్ద లెక్కలు వుండవలసిన అవసరంలేదు. 'కాపిటల్‌'లో వున్న లెక్కలన్నిటిలోకీ పెద్ద లెక్కలు 'శాతాలు' కట్టమే. మిగతావన్నీ చిన్న చిన్న కూడికలూ, తీసివేతలూ, గుణకారాలూ, భాగహారాలూ వంటివే. శాతాలు కట్టం కూడా ఎంత తేలికో, దాన్ని గురించి తెలిసినవాళ్ళకి వేరే చెప్పక్కర్లేదు. ఆ లెక్కలు రానివాళ్ళు వాటిని ఒక్క అరగంట సేపట్లో నేర్చుకోవచ్చు. కాబట్టి, 'కాపిటల్‌' చదివే ముందు, 'ఇందులో ఎంతో పెద్ద పెద్ద లెక్కలు వుంటాయి' అనే అపోహలేమైనా వుంటే, అవన్నీ పూర్తిగా వదిలెయ్యాలి. ఇందులో ఉన్నదంతా లెక్కలు కాదు, తర్కం. లెక్కలంత ఖచ్చితమైన తర్కం. అంటే, హేతుబద్ధమైన చర్చ. దీన్ని 'తర్కం' అనొచ్చు, 'చర్చ' అనొచ్చు, 'విమర్శ' అనొచ్చు, 'పరిశీలన' అనొచ్చు, 'విశ్లేషణ' అనొచ్చు, ఆ రకమైన మాట ఇంకేదైనా అనొచ్చు. ఈ పుస్తకం చదవడనికి, పెద్ద పెద్ద డిగ్రీలూ, పాండిత్యాలూ అక్కర్లేదు. అవి వుంటే నష్టం లేదు గానీ లేకపోతే కూడ నష్టం లేదు.

ఈ పుస్తకం చదివే వ్యక్తికి ఒక లక్షణం తప్పనిసరిగా వుండాలి -- ఏమిటంటే, 'ఆలోచించే' లక్షణం. చాలా పుస్తకాల విషయంలో, చదివే వాళ్ళకి ఆలోచన అక్కర్లేదు. తలకాయని తీసి ఎక్కడన్నా తగిలించి, విశ్రాంతిగా పడుకొని పుస్తకం చదువుకోవచ్చు. కానీ, ఇక్కడ అది పనికి రాదు. ఇక్కడ అడుగడుగునా తర్కమే. పాఠకులు పాల్గొనకుండా, రచయిత తర్కం చేయలేడు. ఆలోచించని పాఠకులకు రచయిత ఏమీ బోధించలేడు. రచయిత బాధ్యత రచయిత నిర్వహిస్తే, పాఠకుల బాధ్యత పాఠకులు నిర్వహించాలి.

Preview download free pdf of this Telugu book is available at Marx Capital Parichayam 1