• Maro Janghala Sastry
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 84
    168
    50% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మరో జంఘాలశాస్త్రి

    Maro Janghala Sastry

    Publisher: Yuva Bharathi

    Pages: 192
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పానుగంటి వారు సృష్టించిన 'సాక్షి'లోని జంఘాలశాస్త్రి ఉపన్యాస వ్యాసాలను చదివి ప్రభావితులై 'మరో జంఘాలశాస్త్రి' అనే పేరుతో వ్యాసాలను వ్రాసినవారు మా మిత్రులు, యువభారతి పూర్వకార్యదర్శి శ్రీ అయలసోమయాజుల నాగేశ్వరరావు గారు.

పానుగంటి సాక్షి వ్యాసాలను చిన్ననాటి నుండి పఠించి, ఆ మహానుభావుని పట్ల ఒక గాఢమైన అభిమానాన్ని పెంచుకున్నవారు. ఆ అభిమానంతోనే అదే వైఖరితో, అదే ధోరణిలో, అదే విచిత్ర పదవిన్యాసంతో, వింతవింతలైన పలుపోకడలతో, సమాజోద్ధరణ దృక్పథంతో, 1980-82 సంవత్సరాలలో ఈ వ్యాసాలను వ్రాశారు. ఈ వ్యాసాలు, ఆనాటి పానుగంటి వ్యాసాలవలెనే నిత్యనూతనంగా ఉన్నాయి. నాగేశ్వరరావుగారు గ్రహించిన అంశాలన్నీ సమకాలిక సామాజిక సమస్యలే. వ్యాసాలన్నీ ఆ సమస్యల పరిష్కారాల సూచికలే. భారతీయ భాషా సాహిత్య సంస్కృతి కళావిజ్ఞాన విషయాత్మకాలే. అంతేకాదు - స్వాతంత్య్ర దినోత్సవం, ఆధునిక కవిత్వం, ఎన్నికలు, క్రికెట్‌ కామెంటరీ వంటి ఆధునిక విషయాలు కూడా ఈ వ్యాసాల్లో ఉన్నాయి.

పానుగంటి వారి జంఘాలశాస్త్రి పాత్రనే శ్రీ నాగేశ్వరరావు గ్రహించి, ఆ పాత్రకు అన్నివిధాలా న్యాయం చేశారు. ప్రక్రియాదృష్టితో పరిశీలించినా, వచనవైఖరిని అనుశీలించినా, భావసంపదను సమీక్షించినా, నాటి జంఘాలశాస్త్రి తీరు తెన్నులే ఆతని మనోవ్యాపార విశేషాలే, ఈ జంఘాలశాస్త్రి వ్యక్తిత్వ చిత్రణలోనూ స్ఫురిస్తాయి. అధిక్షేపం, వ్యంగ్యం, హాస్యం ఈ 'మరో జంఘాల శాస్త్రి'లోనూ ప్రత్యక్షమై మనలను కదిలిస్తాయి. అలా ఆనాటి జంఘాలశాస్త్రి విలక్షణవ్యక్తిత్వాన్ని ఆధునికంగా పోషించడంలో శ్రీ నాగేశ్వరరావుగారు చాలా వరకు కృతకృత్యులయ్యారనే చెప్పాలి. విజ్ఞానాన్నీ వినోదాన్నీ రెంటినీ అందించే వ్యాససంపుటి ఈ 'మరో జంఘాల శాస్త్రి'.

- డా. తిరుమల శ్రీనివాసాచార్య

Preview download free pdf of this Telugu book is available at Maro Janghala Sastry