• Markandeya Maha Puranam
  • Ebook Hide Help
    ₹ 250
    250
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మార్కండేయ మహా పురాణం

    Markandeya Maha Puranam

    Pages: 1183
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారత దేశ మందలి ధార్మిక సాహిత్యములో పురాణములకు ఒక ప్రత్యేక స్థాన మున్నది. హైందవ ధర్మములో వేదములకు ఉత్కృష్ట స్థాన మున్నది మరియు ఆధ్యాత్మిక దృష్టిలో అద్వితీయ స్థాన మున్నది. కాని లౌకిక దృష్టిలో పురాణము యొక్క ప్రాశస్తము మిక్కిలిగా నున్నది. ఉన్నతమైన సాహిత్యము విద్వాంసుల ద్వారా సామాన్య ప్రజలకు పుస్తకముల ద్వారా మనోరంజకముగా తెలియ జేయబడుతున్నది. అదే విధముగా వేదములు, ఉపనిషదులను కూడా కొంతమంది అద్యయన శీలుర యొక్క పరమయి నప్పటికీ వాటిని నిరక్షరాస్యులు కూడా కథలు, పాటల రూపములో తెలుసుకొన గల్గుతున్నారు. అయిననూ కొన్ని కారణముల వలన విద్వాంసులలో గూడా వీని గురించి అనేకమైన సమస్యలు ఉత్పన్నమైనవి మరియు కొంత మంది ఆధునికులు వీటిని కల్పితములుగా భావించుచున్నారు. దీనికి కారణం ఎప్పుడును పురాణముల యొక్క అధ్యయనం చేయక పోవటమే.
మార్కండేయ పురాణము - ఐదు విభాగములు :
• ఒకటవ అధ్యాయము నుండి పదియవ అధ్యాయము వరకు జైమిని యొక్క ప్రశ్నలకు ధర్మ పక్షులు సమాధానములు చెప్పెను.
• పదియవ అధ్యయము నుండి నలుబది నాలుగవ అధ్యాయము వరకు ప్రాణుల యొక్క జన్మ, మృత్యు, ఆవిర్భావ వికాస, తిరో భావములు మొదలగు విషయములను గూర్చి ప్రశ్నింపబడెను. వీటికి సమాధానములు ధర్మ పక్షులు చెప్పినవి.
• 41 వ అధ్యాయము నుండి 80వ అధ్యాయము వరకు మార్కండేయుడు తన శిష్యుడు అగు క్రౌష్టుకికి ఈ పురాణము యొక్క మూల విషయమును వర్ణించెను.
• 81 వ అధ్యాయము నుండి 92 వ అధ్యాయము వరకు దేవీ మహత్యము. దీనిని మేదా మహర్షి చెప్పెను.
• 93 వ అధ్యాయము నుండి అంతిమ అధ్యాయము వరకు కొద్ది మంది ముఖ్య రాజులను గూర్చి వర్ణింప బడినది.

వాస్తవముగా వేదముల, పురాణముల యొక్క సృష్టి క్రమమందు సిద్ధాంత భేదామేమియు లేదు. కాని పురాణ కర్తలు వేదముల యొక్క రూపములను దృష్టాంత శైలిలో విస్తృతముగా వ్యాఖ్యానము చేసి, దానిని సాధారణ బుద్ధి గల జనులకు కూడా భోద పడునట్లు ప్రయత్నమును చేసిరి.

- రాచర్ల రామ సూర్య నారాయణ శాస్త్రి

Preview download free pdf of this Telugu book is available at Markandeya Maha Puranam