• Marakata Manjusha 2
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 85.50
    95
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మరకత మంజూష - 2

    Marakata Manjusha 2

    Author:

    Pages: 238
    Language: Telugu
    Rating
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    4.40 Star Rating: Recommended
    '4.40/5' From 5 votes.
    4.25 Star Rating: Recommended
    4.25 Star Rating: Recommended
    4.25 Star Rating: Recommended
    4.25 Star Rating: Recommended
    4.25 Star Rating: Recommended
    '4.25/5' From 4 premium votes.
Description

భవనం మొత్తాన్ని చుట్టుముట్టి వున్న అగ్నిజ్వాలల వంక చూశాడు ఆనందుడు. అంతకుముందు ఎన్నడూ అనుభవించి ఎరుగని ఒక అనుభూతి అతని శరీరాన్ని గజగజమని వణికించడం మొదలుపెట్టింది.
"తగ్గిపోవాలి ఈ మంటలు… నశించిపోవాలి ఈ వేడిమి... ఇంతటితో ఆగిపోవాలి ఈ విధ్వంసకాండ" అతనికి తెలియకుండానే నోటి నుండి వెలువడ్డాయి మాటలు.
భూకంపం వచ్చినట్లు ఒక్కసారిగా దడదడమని శబ్దం చేసింది నేల... ఎగసి పడుతున్న మంటలు ఒక్కసారిగా తలల్ని క్రిందికి వంచాయి. సుడులు తిరుగుతున్న పొగతో మలినపడివున్న ఆకాశంలో వున్నట్లుండి ప్రత్యక్షం అయ్యాయి నల్లటి మబ్బులు.
కన్నుమూసి కన్ను తెరిచేటంతలో మొదలయింది దారుణమైన ఈదురు గాలి. "అయిపోయింది... నగరం సర్వనాశనం అయిపోవటం పూర్తి అయి పోయింది. ఈ ఈదురుగాలి ధాటికి మంటలు మరింతగా విజృంభించి -" అంటూ వున్నట్లుండి మాటల్ని ఆపింది రాకుమారి చుట్టూ నిలుచుని వున్న చెలికత్తెల్లో ఒకత్తె.
ఈదురుగాలితోపాటు భయంకరమైన వర్షం ఆరంభం కావటమే అందుకు కారణం.
చూస్తూ చూస్తూ వుండగానే తడిసి ముద్ద అయిపోయింది సుజన నగరం. అగ్నిజ్వాలలన్నీ చిటుకు చిటుక్కున అణిగిపోయాయి.

Preview download free pdf of this Telugu book is available at Marakata Manjusha 2