• Manushulu Mamatalu
  • Ebook Hide Help
    ₹ 67.50
    75
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనుషులు మమతలు

    Manushulu Mamatalu

    Publisher: Shaili Publications

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“పెదనాన్నగారూ, నేను సాహితిని మాట్లాడుతున్నాను ... ఈరోజు మధ్యాహ్నం నాన్నగారు ఏదో మీటింగ్‌కి ఎటండ్ అయి ఆఫీసుకు తిరిగి వస్తుండగా పెద్ద యాక్సిడెంటయింది. కారు నుజ్జునుజ్జయింది ... నాన్నగారి కండీషన్ చాలా సీరియస్‌గా ఉంది. నాకు చాలా భయంగా ఉంది పెదనాన్నా!

చిన్న పెదనాన్నగారు ఇక్కడే ఉన్నారు. అయినా నాకు ధైర్యం చాలడం లేదు. పెద్ద పెదనాన్నగారికి ఈ విషయం చెబుదామంటే... అక్కడ తాతగారు ఇది విని తట్టుకోలేరు. పైగా శ్రీకాంత్ అన్నయ్య కూడా అక్కడ లేడు గదా ... వీలైతే మీరొకసారి ఇక్కడకు రాగలరా?” అంటూనే పెద్దపెట్టున ఏడ్చేసింది సాహితి.

ఆ ఏడుపు వినడంతోనే దివాకర్ గుండెలు అదిరిపోయాయి. “అమ్మా సాహితీ ఏడవకమ్మా, నాన్నకు ఏం కాదులే ... నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మను జాగ్రత్తగా చూసుకో, నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తాను” అన్నాడు వణికే కంఠంతో.

“ఎలా తెచ్చుకోమంటారు పెదనాన్నా ధైర్యం? డాక్టర్స్ హెూప్ లేదంటున్నారు” అంది సాహితి ఏడుస్తూనే.

“అలా అనకమ్మా, వాడికేం కాదు ... పైనున్న మా అమ్మ వాడిని తప్పక కాపాడుతుంది. నువ్వు అధైర్యపడకు!” అంటూ ఫోన్ పెట్టేశాడు దివాకర్.

వెంటనే హాస్పటల్‌లో ఉన్న గౌతమ్‌కి ఫోన్ చేశాడు. అతను ఫోన్ ఎత్తగానే “గౌతమ్, రమణ బాబాయికి యాక్సిడెంట్ అయిందట. కండీషన్ చాలా సీరియస్‌గా ఉందట ... నువ్వు వెంటనే పర్మిషన్ పెట్టి ఇంటికిరా! ఈలోగా మనకి ఫ్లైట్‌కి ఏదైనా ఎవైలబుల్‌గా ఉందేమో చూస్తాను” అన్నాడు దివాకర్ ఆదుర్దాగా.

“అవును నాన్నా... ఇప్పుడే నాకు కావ్య ఫోన్ చేసి చెప్పింది. మీకు చేద్దామనుకునేంతలో మీరే చేశారు. కానీ నాన్నా, ఫ్లైట్ అంటే చాలా ఖర్చు గదా... సాయంత్రం ఏదో ఒక టైన్ పట్టుకు వెళ్తాం ... రైల్వే వాళ్లు చాలా మంది మీకు తెలుసు కదా ... మనకు ఎలాగోలా బెర్తులు దొరికేలా చేస్తారు" అన్నాడు గౌతమ్.

“ఇలాంటప్పుడు డబ్బుల కోసం ఆలోచించకూడదురా ... అవతల వాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడట ... ఫ్లైట్‌లో అయితే గంటా, గంటన్నరలో అక్కడికి చేరుకుంటాం!” అన్నాడు దివాకర్ ఆందోళనగా.

“సరే నాన్నా, నేను వచ్చేస్తాను లెండి!” అంటూ గౌతమ్ ఫోన్ పెట్టేశాడు. అన్నట్లుగానే దివాకర్, గౌతమ్‌లు ఫ్లైట్‌లో హైదరాబాద్ చేరుకున్నారు.

Preview download free pdf of this Telugu book is available at Manushulu Mamatalu