-
-
మనుషులు చేసిన దేవుళ్ళు
Manushulu Chesina Devullu
Author: Kodavatiganti Rohini Prasad
Publisher: Hyderabad Book Trust
Language: Telugu
" మతవిశ్వాసాలద్వారా సమకూరే ఉపయోగాలేవీ ఇన్హేలర్ల స్థాయిని మించవు. వాటివల్ల వ్యక్తిగత ఆరోగ్యానికి గాని, సమాజపు ఆరోగ్యానికి గాని పట్టిన ‘జలుబు’ ఎంతమాత్రమూ తగ్గదు. పైగా ‘సైడ్ ఎఫెక్ట్స్’ చాలా ప్రమాదకరమైనవి. వ్యక్తిగతంగా నిరపాయకరంగా అనిపించే నమ్మకాలు సామూహికంగా ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తాయో రోజూ ప్రపంచమంతటా జరుగుతున్న మతహింస నిరూపిస్తూనే ఉంది.
ప్రాణులను సృష్టించింది దేవుడనే భావన మానవజాతి చరిత్రలో ఒక దశలో తలెత్తిన తప్పుడు నమ్మకం. మతాన్ని నమ్మడమంటే సుఖసంతోషాలూ, భద్రతాభావమూ కరువైన ఈ ప్రపంచంలో వాటిని వెతుక్కునేందుకు చేసే వ్యర్థ ప్రయత్నమే.
ఈనాటి సామాన్యుల జీవితాల్లోని సామాజిక ఆర్థిక అనిశ్చితిస్థితి వారిని మరింత అయోమయానికీ, గుడ్డి నమ్మకాలకూ గురిచేస్తుందనడంలో సందేహం లేదు. ఇది కొందరి వ్యక్తిగతనమ్మకమూ, బలహీనతా కాదు.
దేవుడున్నాడని వాదించే వారికి సమాధానం చెప్పాలంటే దేవుడు లేడని వాదిస్తే సరిపోదు. వారికి ఆ అపోహ ఎప్పుడు, ఎందుకు, ఎలా కలిగిందో కూడా చెప్పాలి."
మతం అనే భావన ఎప్పుడు ఎలా పురుడు పోసుకుంది? మతానికి గల చారిత్రక, సామాజిక, మానసికమైన మూలాలు ఎక్కడున్నాయి? మతాల నేపధ్యం, లాభనష్టాల గురించి విస్తృత అధ్యయనంతో వైజ్ఞానికంగా లోతుగా విశ్లేషించే రచన ఇది.
