-
-
మంత్రగత్తెల వేట
Mantragattela Veta
Author: Praveen Kumar Mandangi
Publisher: Self Published on Kinige
Pages: 48Language: Telugu
మన దేశంలో చేతబడి అనుమానం వల్ల హత్యకి గురవుతున్నవాళ్ళలో ఎక్కువ మంది మహిళలే. ఆ మహిళలలోనూ ఎక్కువ మంది పెళ్ళి కాని స్త్రీలు, భర్త చనిపోయిన స్త్రీలు, భర్త నుంచి విడిపోయిన స్త్రీలు. పల్లెటూర్లలో భర్త చనిపోయిన స్త్రీలకి రెండో పెళ్ళి చెయ్యకుండా ఒంటరిగా ఉంచేస్తుంటారు. ఆ స్త్రీలు తమ పిల్లలని పోషించుకోవడానికి చిన్నచిన్న పనులు చేసుకుంటూ సంపాదిస్తుంటారు. ఒకవేళ ఆ స్త్రీలు తమ సంపాదన సరిపోవడం లేదని అన్నదమ్ములకి ఆస్తిలో వాటా అడిగితే వాళ్ళు మంత్రగత్తెలుగా ముద్ర వెయ్యబడతారు, ఆ తరువాత హత్యకి గురవుతారు. ఒక వైపు మహిళలు కిరణ్ బేడీలాగ IPS అధికారులు అవుతున్నారని పొగుడుతుంటాం. అదంతా మాటల్లో మాత్రమే ఉంటుంది కానీ చేతలలో ఉండదు. మాటల్లో స్త్రీలని పొగుడుతారు కానీ చేతలలో స్త్రీని కేవలం ఒక అమ్మగా లేదా ఒక అక్కగా మాత్రమే చూస్తారు. స్త్రీని కేవలం అమ్మగా, అక్కగా చూడడం వల్ల స్త్రీ-పురుష సమానత్వం రాదు. చేతబడి అనుమానంతో స్త్రీలపై దాడులు చేసేటప్పుడు అమ్మ, అక్క లాంటి సెంటిమెంట్లు కూడా గుర్తుండవు.
