• Manoveedhi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనోవీధి

    Manoveedhi

    Author:

    Pages: 102
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

1980 నుండి దాదాపు మూడు దశాబ్దాల పాటు శిరీష రాసిన కథలు ఇందులో ఉన్నాయి. ఈ కాలంలో సామాజిక, ఆర్థిక రంగాలలో వచ్చిన పరిణామాలనూ, తీవ్రస్థాయికి చేరిన అంతరాలనూ, స్త్రీల అస్తిత్వ పోరాటాలనూ చర్చించిన కథలివి. మానవ సంబంధాలన్నింటినీ ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే నిర్దేశించే పరిస్థితీ, విచ్ఛిన్నమవుతున్న కుటుంబ సంబంధాలూ, విలువల విధ్వంసమూ, చివరికి ఒంటరితనంలోకీ, నైరాశ్యంలోకీ జారిపోతున్న మనుషులూ.... ఈ అంశాలన్నిటినీ కొన్ని జీవన దృశ్యాలుగా తన కథల్లో పొదిగారు శిరీష. ఏ సమస్యనైనా దాని వెనుకున్న సామాజిక నేపథ్యంతో కలిపి చూపడమనేది దాదాపు అన్ని కథల్లోనూ సామాన్య లక్షణం. ఈ కథల్లో చర్చించిన సమస్యలన్నీ వ్యవస్థతో, భావజాలంతో ముడిపడినవే తప్ప కాల్పనికమైనవి కాదు. అందువల్లనే రెండు, మూడు దశాబ్దాల కిందట రాసినవైనా కొన్ని కథలు తాజాగా, సమకాలీనంగా కనబడుతాయి. మొత్తం విూద చర్చనీయమైన ఇతివృత్తాలతో, సరళమైన వచనంతో, ఆశావహ దృక్పథంతో సాగే కథలివి.

- కాత్యాయని

* * *

ఈ కథలు - జీవితాన్ని కలవరించి పలవరించి అందులోని ఘర్షణను నిజాయితీగా అక్షర బద్ధం చేసాయి. ఈ జీవితం ఇలా ఎందుకుంది, ఎలా ఉండాలనుకుని ఎలా ఉంటున్నాం, ఉండాలనుకున్నట్టుగా ఉండలేకపోవడానికి అడ్డుపడుతున్న అంశాలేమిటి అనే అన్వేషణతో సాగే కథలివి. వ్యక్తికి నిర్మాణానికి మధ్య; ఆదర్శానికి ఆచరణకు మధ్య నలిగిపోయే మధ్యతరగతి మనుషుల వ్యథలివి. మంచి చెడూ అని గీతలు గీయకుండా మానవ స్వభావంలోని అనేక షేడ్స్‌ చిత్రించడం ఈ కథల్లో ప్రత్యేకంగా కనిపించే అంశం. సున్నితత్వం పోకుండా కఠోరమైన వాస్తవాలని చెప్పిన తీరు విశిష్టం. జీవనయానంలో ఎదురయ్యే సంక్షోభాలకు కుంగిపోకుండా కొత్త దారి వెతుక్కునే విశ్వాసాన్ని చూపించాలన్న రచయిత్రి తపన ఈ కథల్లో వ్యక్తమవుతుంది. కొన్ని ఆదర్శాలు, విలువలతో మొదలై వాటిని నిలుపుకోలేక పతనమై పోతుంటే వాళ్లూ, వారితో ముడిపడిన మనుషులూ పడే పెనుగులాట మనల్ని కుదురుగా ఉండనివ్వదు. అదే ఈ కథల బలం.

- జి. యస్‌. రామ్మోహన్

Preview download free pdf of this Telugu book is available at Manoveedhi
Comment(s) ...

ఈ పుస్తకంపై పరిచయ వ్యాసం పుస్తకం.నెట్‌లో
http://pustakam.net/?p=19055