• Manishi Deergha Kavita
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనిషి - దీర్ఘ కవిత

    Manishi Deergha Kavita

    Pages: 34
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనిషి లోని మనిషి ని తట్టిలేపే దీర్ఘ కవిత : ' మనిషి’
సబ్బని లక్ష్మీ నారాయణ మానవతా విధ్వంసాన్ని గూర్చిన తన ఆవేదనను వ్యక్తీకరించడానికి ‘మనిషి ‘ అనే దీర్ఘ కవితను రాసారు. ఇందులో మానవతా మూలాలున్నాయి, మానవతా నిర్వచనముంది, అనేక కోణాల్లో చేసిన మానవతా పరిశీలనా ఉంది. అందుకే తన భావాల్ని చెప్పడానికి దీర్ఘ కవితా రూపాన్ని ఎంచుకొన్నారు. నటన నటన నటన
అందమైన నటన
భార్య భర్తలుగ నటన, ప్రేయసీ ప్రియులుగ నటన,
మిత్రులు హితులుగ నటన
సమస్త జీవిత సన్నివేశాల్లో నటన
నటనే జీవితంలో భాగమైపోయింది
మనిషి నిజంగా జీవించేప్పుడూ?
ఇలా మొదలవుతుంది ఈ దీర్ఘ కవిత . ఏ నటన లేకుండా జీవితం సాధ్యం కాదు, మంచి నటన కూడా నటించవలసి ఉంటుంది. అయితే ముఖ్యంగా సబ్బని ఈ దీర్ఘ కవితలో చెప్పదలచుకున్న ఒక తాత్వికమైన అంశం, ఇది మొదటి స్థాయిలో చెడ్డ నటనను ఖండించి, మానవత్వాన్ని పెంపొందించే ఆశయంతో సాగుతుంది. రెండో స్థాయిలో ఏ విధమైన నటననైనా ఖండించి, అత్యుత్తమమైన మానవుని కోసం అన్వేషణ చేస్తుంది.
అడుగడుగునా అవినీతిని ప్రక్షాళన చేయాలి
పరిమళాల పూదోటను అవనిలో పూయించాలి
మానవత్వ.మనే జెండాను మనసుల్లో ఎగరెయ్యాలి
విశ్వ శాంతి కోసం ప్రగతి బాట వెయ్యాలి
మనిషి కోసం, మన కోసం, మమత కోసం, సమత కోసం.
ఇవి ఈ దీర్ఘ కవితకు ముగింపు మాటలు. మానవత్వం, ప్రగతి శీలత తోనే విశ్వ శాంతి వస్తుంది. మనిషి, వాడి బతుకు అప్పుడే బాగు పడతాయి. ఇది ఈ దీర్ఘ కవిత లోని సందేశం .
సబ్బని లక్ష్మీ నారాయణ రాసిన ' మనిషి ' దీర్ఘ కవిత మనిషి తనను తాను సరిచేసుకోవడానికి తగిన ఆలోచనాలనిస్తుంది. జీవిత పరమార్ధాన్ని సాధించే భావాన్ని బలపరుస్తుంది. ఈ రెండు ప్రయోజనాల కోసం, ప్రభోదాత్మకంగా 'మనిషి' దీర్ఘ కవితను రాసిన సబ్బని లక్ష్మీ నారాయణ అభినందిస్తూ, ఉద్యోగ విరమణ సంధర్బంగా శుభాకాంక్షలు చెప్తున్నాను.

- కాకినాడ, - డా. అద్దేపల్లి రామ మోహన రావు
తేదీ: 12-10-2015.

Preview download free pdf of this Telugu book is available at Manishi Deergha Kavita