• Manimalikalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మణిమాలికలు

    Manimalikalu

    Publisher: Palapitta Books

    Pages: 186
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ ''మణిమాలికలు'' క్లుప్తంగా సాగే ఒకానొక ప్రక్రియగా, అతిక్లుప్తతతో, భావనాశక్తితో రూపుదిద్దుకొని పాఠకుల్ని ఆకర్షిస్తున్నాయి. ''ఫేసుబుక్‌''లో ఇదొక గ్రూపుగా,వేదికగా ప్రాచుర్యం పొందుతూ ఉండడం ఈ క్లుప్త కవిత్వప్రయోగ సఫలతను చూపిస్తుంది. మొదటివాక్యము రెండవ వాక్యానికి సంబంధించిన పదాల నిడివిని ముందే నిర్ణయించుకొని, ఆ పరిధిలో, చెప్పదలచిన భావాన్ని కుదించి చెప్పడం కవి నైపుణ్యానికి సవాలే. ఆ పరిమిత చట్రంలో చెప్పదలచిన, పాఠకుడికి చేరవలసిన భావనను చేరవేయడం కూడా ఎంతో నేర్పుగా వ్యక్తీకరించం ఒకరకంగా కత్తిమీద సామే. ఇన్ని చట్రాలను, ఇన్ని పరిమితులను అధిగమిస్తూ ''మణిమాలికల'' వేదికలో అనేకమంది రాయడం సంతోషించే విషయం. అందులోంచి 20 మంది ఇవాళ ఈ పుస్తకరూపంలో వెలుగుచూస్తుండం మంచి పరిణామం.

''మణిమాలికలు'' మెరుపుల్లా, తటిల్లతల్లా ఉంటాయి. వేగవంతమైన ప్రవాహ జీవితంలో రెండుపాదాలుగా విస్తరించే భావ ప్రకటనలివి. ఒక విధంగా చూస్తే ఇవి, సెల్‌ ఫోనులో మెసేజుల్లా కనిపిస్తున్నాయి. గతంలో ఈ''మణిమాలికల''కు దగ్గరి పోలికలున్నవి అనేకం కనిపిస్తాయి. కొద్దితేడాతో నానీలు, నానోలు, ఫెంటోలు, ఇంకా వెనక్కువెళితే ద్విపదలు, ధ్యానం రూపుగట్టిన ''హైకూలు'' కనిపిస్తాయి. ఐతే ఇప్పుడు ఒక విషయాన్ని పాఠకులకు అందించనికి ఎన్నుకొనే సాధనం, లేదా సాంకేతిక క్రమంగా ఈ ''మణిమాలికల'' మాధ్యమం కనిపిస్తుంది.

ఇందులో ప్రధానంగా కనిపించే వస్తువులు- ప్రేమ, విరహం, వెన్నెల, ఎడబాటు, ప్రకృతి, కాంక్ష, వైఫల్యాలు, జీవితం మొదలైనవి. ఇవన్నీ చదివితే చుట్టూవున్న జీవితం, సమాజం, మానవ సంబంధాలు, వాటి పరిణామాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ముందుగా చెప్పుకున్నట్టు ప్రేమ, విరహం ఇత్యాది అంశాల గురించి రాసినవి ఎక్కువే. కొన్ని గాఢతగా వ్యక్తీకరించినవి, మరికొన్ని అలవోకతనంతో సాగినవి. ఆశ్చర్యానికి, సంభ్రమానికి గురిచేసే ''మణిమాలికలు'' కూడ లెక్కకు మించే ఉన్నాయి.

సంతోషించాల్సిన విషయమే మిటంటే, ఒకప్పటిలా కాకుండ, ఫేసుబుక్‌ పుణ్యమా అని కవిత్వరంగానికి దూరంగా బతుకుతున్న వాళ్ళు, తమతమ స్థాయిలలో తమ భావాలను, కవిత్వ వ్యక్తీకరణగా మలిచే ప్రయత్నం చేయడం. పదునైన, మెరుగైన ఊహాశాలిత్వం ప్రదర్శించడం. దానికి ''మణిమాలిక'' వేదిక కావడం శుభపరిణామం. సహజంగా స్పందించడం, రాయడం, జీవితాన్ని పలకడం, జీవితాన్ని చుట్టుకొనివున్న ప్రకంపనాల్ని, వేదనల్ని, సంతోషాల్ని, సందర్భాల్ని కవిత్వీకరించడం అనే పనికి పూనుకున్నందుకు ఇందులో రాసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ... జయహో !

- కవి యాకూబ్‌

Preview download free pdf of this Telugu book is available at Manimalikalu