• Mandukyopanishatsaramu
  • Ebook Hide Help
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మాండూక్యోపనిషత్సారము

    Mandukyopanishatsaramu

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 278
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రాచీన ఋషుల విశేష విజ్ఞానమే ఉపనిషత్తులు. వంద పైనే వున్న ఉపనిషత్తులన్నింటినీ చదవలేకపోయినప్పటికీ వాటి సారమంతా మాండూక్యోపనిషత్‌ ఇస్తుందని శ్రీ శంకరాచార్యలు తెలియజేశారు. శ్రీ మాండూక్యమహాముని ఈ ఉపనిషత్తును తమ ధ్యానములో దర్శించారు. కనుక మాండూక్యోపనిషత్తు అనబడుతుంది. ఈ ఉపనిషత్తు అన్ని ఉపనిషత్తులలో కంటే చిన్నది. ఈ ఉపనిషత్తు ఆత్మ జ్ఞానమును బోధిస్తుంది.

మాండూక్య ఉపనిషత్తు ఓమ్‌ చిహ్నము ద్వారా తన సందేశమును అందించింది. ఇందు బోధ జాగ్రత్‌, స్వప్న, సుషుప్తావస్థలతో ప్రారంభమై తురీయమునకు తీసుకువెడుతుంది. మాండూక్యోపనిషత్తు అంతిమసత్యమును తెలియజేయు చిహ్నము 'ఓం' యని తెల్పింది. ఓం త్రిగుణాత్మకమైన మూడు అక్షరముల సముదాయము. అవి అ-ఉ-మ. ఈ మూడు అక్షరములే మానవుని సంపూర్ణ జీవితానుభవమైన మూడు అవస్థలను తెలియచేస్తాయి. ఓం విశ్వానికి శబ్ధ ప్రతీక. ఓమ్‌ బ్రహ్మచిహ్నముగా తెలుపబడింది. ఓమ్‌ ఉచ్ఛారణ శబ్ధజాలమంతటా వుంటుంది. ఓమ్‌-శబ్ధ బ్రహ్మ అనబడుతుంది. ఓమ్‌ విశ్వమందలి భిన్న శబ్ధములకు మూలము.

మాండూక్యోపనిషత్తు నాల్గు ప్రకరణముల ద్వారా ఆత్మ బోధను అందించింది. ఈ బోధను అందుకొన్న మానవుని జీవితము ధన్యమౌతుంది. పరిణామంలో చిన్నదైనప్పటికీ మాండూక్యోపనిషత్తు అన్ని ఉపనిషత్తుల ఉపదేశమును అందజేసింది. సాధకుని జ్ఞానప్రాప్తికి మాండూక్యోపనిషత్తు ఒక్కటే చాలు.

- ఆకెళ్ళ పార్వతి

Preview download free pdf of this Telugu book is available at Mandukyopanishatsaramu