• Manchimatalu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మంచిమాటలు

    Manchimatalu

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 175
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శబ్దం అనే జ్యోతి లేకపోతే మూడు ప్రపంచాలు అంధకార బంధురంగా ఉండేవని దండ్యచార్యుని వచనం. మూడు లోకాలు శబ్దంతోటే నడుస్తున్నాయి. అలాంటి శబ్దమేవాక్కు. అదే మాట. అయితే ఆమాట మంచిమాటయితే సూక్తి అవుతుంది. మన ప్రాచీన వాఙ్మయా ధారాలైన వేద పురాణ ఇతిహాసాలలో సూక్తులకు కొదవలేదు. అసలు ధర్మార్ధకామమోక్షాలనే చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధి సమాస్తానికి మన ప్రాచీన వాఙ్మయమే మూలం కదా !

ప్రాచీన భారతీయ వేద పురాణ ఇతిహాస ధారను అంతటిని గ్రహించటానికి, మనన పఠనాలు చేసుకొనటానికి సామాన్యులకు అంతగా అవకాశం దొరకక పోవచ్చు. అందుకు సాంసారిక ఈతి బాధలు, సమయాభావము, మొదలైన ఎన్నో కారణాలు ఉండవచ్చు. అందుకే సామాన్యుల కోసం ఈ మహాధార అనుశ్రుతంగా రావాలంటే ఏదోఒక వాహికఅవసరం. ఆ వాహిక మహాపురుషుల వాక్కుల ద్వారా మనకు లభిస్తున్నది. ఇలాంటి మహాపురుషులలో స్వామి శ్రీ ఈశ్వర్‌ గారు ఒకరు. వారు అనేక సందర్భాలలో తమ ముఖంనుండి వెలువడిన ఎన్నో ఉపదేశాలలోని మంచిమాటలను కొన్నింటిని జిజ్ఞాసువులు గ్రంధస్థం చేశారు. శ్రీ స్వామివారి ఆ మంచి మాటలు లేక సూక్తుల సమాహారమే ఈ పుస్తకం. ఇలాంటి పుస్తకాలు మన తెలుగు భాషలో చాలా కొద్దిగానే ఉన్నాయి. ఆ కొరతను తీర్చటానికా అన్నట్లుగా శ్రీ స్వామివారు ఈ గ్రంధాన్ని సంకలితం చేయించటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నది. ఇందులోని అనేక సూక్తులు చాలా ఉపదేశయుతంగా ఉండటమే కాదు. సందర్భోచితంగా కూడ ఉన్నాయి. ఒకటి చూడండి ''కోరికలనే లగేజి తగ్గించు/శాంతి అనే రైలులో సుఖంగా ప్రయాణించు.'' (Less Luggage more comfort) అనేది రైలు ప్రయాణానికే కాదు జీవన ప్రయాణానికి కూడ ముఖ్యమే కదా ! ఇలాంటి సూక్తులు ఇంకా ఎన్నింటినో ఇందులో శ్రీ ఈశ్వర్‌గారు సమకూర్చారు. ఇలాంటి ఉత్తమ గ్రంథం, సూక్తిరత్నాకరాన్ని ప్రకటించటానికి మాకు అవకాశం ఇచ్చిన స్వామివారికి అనేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

- ఐ. రామకుమార్‌, ప్రచురణకర్త

Preview download free pdf of this Telugu book is available at Manchimatalu