-
-
మంచి ఉపన్యాసకుడంటే ఎవరు?
Manchi Upanyasakudante Evaru
Author: Dr. V. Brahma Reddy
Publisher: Jayanthi Publications Vijayawada
Pages: 105Language: Telugu
నలుగురిలో కూర్చుని గంటల తరబడి మాట్లాడగల వ్యక్తిని పదిమందిలో లేచి నిలబడి పది మాటలు మాట్లాడమనండి. ఏదో కొంపలంటుకుంటున్నట్లు గుండె దడదడ కొట్టుకుంటుంది. అరచేతులు చెమటలు పడ్తాయి. వళ్ళంతా తడిసి ముద్దయిపోతుంది.
నోరు పిడచగట్టుకుపోతుంది. ఎన్నెన్నో మాటలు ఒక్కసారిగా బయటకు రావాలని పోటీపడి ఒక్కటి గూడా పెదాలు దాటి బయటకు రాదు. కాళ్లలో సన్నగా వణుకు మొదలవుతుంది.
ఇదొక భయంకరమైన, ఇబ్బందికరమైన స్థితి. ఈ స్థితిని అధిగమించాలంటే ఏం చేయలి?
ఉపన్యాసం ఎలా మొదలుపెట్టాలి? ఎలా మొదలుపెట్టకూడదు? ఉపన్యాసం లోపల విషయం ఎలా వుండాలి? భాష, భావం ఎలా వుండాలి? సభికుల్లో ఉత్కంఠను ఎలా పెంచాలి? ఎలాంటి ముగింపు వుండాలి? ఎలాంటి ముగింపు వుండకూడదు? నీవు మాట్లాడదామనుకున్న విషయం నీ ముందు వారు మాట్లాడేసి నీకు ఏమీ మిగల్చకపోతే ఏం చేయాలి? మొదలగు ఎన్నో సూత్రాలకు వివరాలు తెలుసుకోవాలి. మంచి ఉపన్యాసం ఇవ్వడం అనేది ఒక కళ. ఆ కళ వెనుక ఎంతో పరిశీలన, శాస్త్రీయ అవగాహన అవసరం. మీరూ ఓ మంచి వక్త అవ్వాలని లేదూ? మంచి వక్త కావాలనుకొనే ప్రతీ ఒక్కరికీ ఈ "మంచి ఉపన్యాసకుడంటే ఎవరు?" ఎంతో తోడ్పడుతుంది.
