• Manava Yagnam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    108
    44.44% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మానవ యజ్ఞం

    Manava Yagnam

    Pages: 238
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

గదిలోకి వెళ్ళి ధ్యానంలో కూర్చుంది. తనకి తెలిసి తెలియని వయసులో ఈ ధ్యానం ద్వారా సంపాదించిన మహత్తుతో చాలా విషయాలు వీళ్ళకి తెలియ చెప్పింది ఆనందినీమాత. క్రమక్రమంగా తెలిసీవచ్చింది అదెంత వూబిలా వుందో...! తెలిసిన తర్వాత మనస్కరించడంలేదు ఆ పని చేయడనికి. అందుకే ధ్యానంలో కూర్చున్నా తరచుగా విఫలమౌతోందీ మధ్య.

పద్మాసనం వేసుకుని నిశ్చలంగా కూర్చుంది ఆనందినీమాత. ఏకాగ్రతనంతా భృకుటి మధ్యకి తెచ్చి మధించడం ప్రారంభించింది. ఊహూ! ఫలించడంలేదు. దేశమాత కళ్ళముందు కన్పిస్తోంది. వందకోట్లకి పైగా ఉన్న భారతీయుల ఆశలు కనిపిస్తున్నాయి.

ఈ దేశానికి ద్రోహంగా పరిణమించే ఏ పనినీ ఇక తను చేయలేదు. కానీ తన ఎదుటవున్న వీళ్ళు సామాన్యులుకాదు, తనని అంత సులువుగా వదిలి వేయడనికి. గత ఇరవై ఏళ్ళుగా ఈ భూమ్మీదే నివాసం ఏర్పరచుకుని మరీ కృషి చేస్తున్నవాళ్ళు. తమ లక్ష్యసాధనకోసం ప్రాణాలను పణంగా ఒడ్డి పోరాడుతున్నవారు... వీళ్ళని ఎదిరించడం తనకేమాత్రమూ సాధ్యంకాదు.

ఆలోచనలు సాగుతుండంతో భృకుటి ముడిపిందామెకి.

అది గమనించి వాళ్ళిద్దరూ మొహమొహాలు చూసుకుంటున్నారు. ఆ క్షణంలో నిస్సహాయంగా కళ్ళు విప్పింది ఆనందినీమాత. పెదవి విరిచింది. విషయం అర్థమయింది వాళ్ళకి.

''నీ సంగతి ఏవయింది... నువ్వు వెతుకుతున్న మనిషి కన్పించాడా?'' అడిగాడు వాళ్ళలో ఒకతను.

నోటివరకూ వచ్చిన మాటని తటాలున ఆపుకుని - ''లేదు...'' సమాధానమిచ్చింది.

Preview download free pdf of this Telugu book is available at Manava Yagnam
Comment(s) ...

Really nice Book punarjanmala backdrop lo story chala bagundhi

అద్భుతం అనే మాటకు కచ్చితమైన నిర్వచనం..