-
-
మనసు తడి ఆరనీకు
Manasu tadi aaraneeku
Author: Omprakash Narayan Vaddi
Publisher: Om Prakash Prachuranalayam
Pages: 176Language: Telugu
మీరి కథలు చదవండి చాలా సంతోషిస్తారు. సాహిత్యానికి సమాజానికి ఉన్న, ఉండవలసిన సంబంధం మీ గుండేల్లో గూడు కట్టుకుంటుంది. ఇక మీరు ఆలోచిస్తారు. అలా ఆలోచిస్తే మీకొక ఆచరణ మార్గం కనిపిస్తుంది. అంతకంటే ఏ సాహిత్యానికైనా ఏం కావాలి? నేను నమ్మకంగా చెబుతున్నాను. పుస్తకం చదివాక మీరు ఓంప్రకాశ్‌తో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో స్నేహాం చేస్తారు.
- ఆచార్య కొలకలూరి ఇనాక్
ఎన్నో కథలు రాసిన అనుభవశీలీ, అధ్యయనశీలీ అయిన ఓంప్రకాశ్కి తన రచనకి చదివించే గుణం అలదటం అనే నైపుణ్యం బాగా వుంది. ఈ నైపుణ్యమే ఆ కథల్ని మంచి రచనలుగా మలుస్తోంది. ప్రకృతి ప్రేమికుడిగా - ఓంప్రకాశ్ - చాలా చోట్ల అద్భుతమైన, ఆహ్లాదకరమైన వాతావరణ వర్ణన చేస్తూ కథకొక "రిచ్‌నెస్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్"ని కూరుస్తారు.
- శ్రీ విహారి
ఎన్నో మంచి అనుభవాలు, వాటిని కథలుగా మలచాలనే సంకల్పమూ, పాఠకులు ఆపకుండా చదివేతీరున వాటిని సులభసుందరమైన శైలిలో వ్యక్తీకరించటమూ, అందుకు అవసరమైన భాషాగతమైన పట్టు ఈ నాలుగు వనరులూ ఉన్న రచయితలలో ఓంప్రకాశ్ ఒకడు. 'కథలంటే కాగితాన్ని నలుపు చేయడం కాదు, నిద్రిస్తున్న లోకానికి మేలుకొలుపు పాడటం' అన్న స్పష్టమైన అవగాహనతో వ్రాసిన కథలివి.
- శ్రీ వడ్డి విజయసారధి
ఈ పుస్తకం గురించి వివిధ పత్రికలలో వచ్చిన రివ్యూలు చదవడానికి ఇక్కడ నొక్కండి. http://omprakashpublications.blogspot.in/2014/01/reviews-on-manasu-tadi-aaraneeku-book.html