• Mana Telugu Thalli
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    120
    40% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మన తెలుగు తల్లి

    Mana Telugu Thalli

    Pages: 255
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగువారి ఘన చరిత్రను ఈ పుస్తకం రూపంలో సగర్వంగా మీ ముందుంచుతున్న సందర్భంగా భారతదేశ సమైక్యత, సమగ్రతల పట్ల నాకు ఎనలేని విశ్వాసం ఉందని, అలాగే, రాష్ట్ర ప్రయోజనాల కన్నా, దేశ ప్రయోజనాలే మిన్న అని నా ప్రగాఢ విశ్వాసం.

మన దేశంలో ఈనాడు భాషాప్రయుక్త రాష్ట్రభావనకు ముప్పు వాటిల్లింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశ సమైక్త్యతకు భంగం వాటిల్లజేస్తాయన్న తొలినాటి భయాలు అర్థం లేనివని తేలిపోయింది. అందుకు భిన్నంగా భాషాప్రయుక్త రాష్ట్రాలు దేశాన్ని మరింత పటిష్టం చేసాయి.

బలహీనమైన రాష్ట్రాలు కేంద్ర అధికారాన్ని బలోపేతం చేస్తాయన్న భావన కల్పితం మాత్రమే. నా ఉద్దేశంలో, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి భాషా ప్రయుక్త రాష్ట్రాలను విభజించడం వలన వేల సంవత్సరాల ఆయా సంస్కృతులకు తీరని నష్టం వాటిల్లుతుంది.

ఈ పుస్తకం రాయడం అనుకోకుండా జరిగింది. రాష్ట్రంలో విభజనపై వివాదం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు, రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు ఏర్పడ్డానికి మూల కారణాలేమిటో తెలుసుకుందాం అనిపించింది. మన గతం తవ్వుతున్న కొద్దీ, నేను తెలుసుకున్నది, నా తోటి తెలుగువారితో పంచుకోవాలన్న పట్టుదల నాలో పెరిగింది. సాధ్యమైనంత మంది తెలుగువాళ్లతో పంచుకోవాలన్న ఉద్దేశంతో వీలైనంత సరళంగా, క్లుప్తంగా రాయ ప్రయత్నించాను. పాఠకులకు నా ఈ పుస్తకం ఉపయోగకరమైనదిగానూ, ఆసక్తికరంగానూ వుంటుందని ఆశిస్తున్నాను.


- నలమోతు చక్రవర్తి

Preview download free pdf of this Telugu book is available at Mana Telugu Thalli