• Mallishwari
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మల్లీశ్వరి

    Mallishwari

    Author:

    Publisher: Sarathchandra

    Pages: 189
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"అక్షర లక్షల కినిగె తెలుగు నవలల పోటీ 2014" కి "శరత్‌చంద్ర" పంపిన నవల "మల్లీశ్వరి".

* * *

KinigeNovelCompetitionLogo
ఆ రోజు మరో మూడు గంటల్లో కాంపిటీషన్ మొదలవుతుందనగా... ఒక సారి పరమేశ్వరిని కలిసి 'బెస్ట్ విషస్' చెప్పాలనుకున్నాడు సుబ్రహ్మణ్యం. ఆమె ఉండే గది వైపు నడిచాడు. తలుపు తీసుకుని లోపలికి వెళితే ఇరవై మూడేళ్ళ యువకుడు కూర్చుని 'బ్రెయిలీ'లో ఏదో చదువుకుంటున్నాడు. సుబ్రహ్మణ్యం అడుగుల చప్పుడుని... కావేరిగా భ్రమించాడు.

"కావేరీ... త్వరగా రెడీకా.. స్టూడియోకి వెళ్దాం... ఎలాగైనా నువ్వు గెలవాలి.... మన అమ్మా... నాన్నకు ముందు 'చూపు' తెప్పించాలి... మనల్ని కన్న వాళ్ళ ఋణం తీర్చుకోవాలి..." అంటున్నాడు.

అంతలో పక్కనున్న బాత్‌రూం నుంచి కావేరి వస్తుంది. తలంటి స్నానం చేసి వచ్చింది... అపర సరస్వతి దేవిలా వుంది. "ఎవరితో అన్నయ్యా... మాట్లాడుతున్నావు?" అడిగింది.

"నువ్వు రాలేదా? ఏవో అడుగుల చప్పుడు వినిపిస్తే నువ్వేననుకొన్నా..." అన్నాడు నవ్వుతూ.

"మన అంధుల బ్రతుకు ఇంతే కదరా?.. గాలి తెమ్మెరలను కూడా ఒక్కోసారి పాదాల చప్పుడు అనుకుంటాం..." అంది తనూ అతడి నవ్వుతో శృతి కలుపుతూ.

"అందుకే ఈ అంధత్వం అమ్మా నాన్నలకు పోగొట్టాలిరా... ఈ 'క్యాష్' ప్రైజ్ నువ్వు గెలవాలి..." మళ్ళీ అన్నాడతను. కుటుంబమంతా అంధులా? కడుపులో దేవినట్లైంది సుబ్రహ్మణ్యానికి.... చప్పున కన్నీళ్ళు దుమికాయి.

Preview download free pdf of this Telugu book is available at Mallishwari