• Malleeswaram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మల్లీస్వరం

    Malleeswaram

    Author:

    Pages: 108
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మల్లీశ్వరి 21వ శతాబ్దంలో సాహిత్యాన్ని సమాజాన్ని అస్థిత్వ ఉద్యమ చైతన్యంతో మరీ ముఖ్యంగా స్త్రీల కోణంనుండి విలువ కట్టడానికి నిబద్ధమైన యువతరానికి ప్రతినిధి. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటుకు బీజాలు వేసిన ‘మనంలో మనం’ రచయిుత్రుల సభను విశాఖ సాహితీ మిత్రుల సహకారంతో నిర్వహించిన చైతన్యం తనది.

ఈ పుస్తకంలో సాహిత్య వ్యాసాలున్నాయి. అవి కథల మీద నవలల మీద రాసిన వ్యాసాలు. సినిమా మీద స్వీయ చరిత్ర మీద చెరొక వ్యాసం వుంది. సమకాలీన సామాజిక రాజకీయ సందర్భాలను సంఘటనలను వ్యాఖ్యానించిన కాలమ్‌ రచనలు వున్నాయి. రచన రూపం ఏదైనా రచనా విషయం ఏదైనా కేంద్రం మాత్రం స్త్రీనే.

ఇంటా బయటా స్త్రీలపై నిరంతరం జరుగుతున్న హింసను, సామాజిక రాజకీయ రంగాలలో స్త్రీలను ఒక సంప్రదాయ నమూనాలో ఇరికించి స్థిరీకరించి సవాళ్లను ఎదుర్కొనలేని శక్తిహీనులుగా చూపించే నిరంతర కుట్రను నిరసించే స్వరం అన్నింటా ఒకటే. వాకపల్లి, సోంపేట పోరాట మహిళల పక్షాన నిలబడిన మల్లీశ్వరి రాసిన ‘మల్లీస్వరం’ పుసక్తం ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ద్వారా ప్రచురించడం ఆనందంగా వుంది.

- కాత్యాయనీ విద్మహే

Preview download free pdf of this Telugu book is available at Malleeswaram