• Mainteen
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మెయిన్‌టీన్ (టీనేజర్ల విజయసోపానాలు)

    Mainteen

    Author:

    Pages: 221
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పురుషులందు పుణ్య పురుషులు వేరు అన్నట్టుగానే పుస్తకాల్లో మంచి పుస్తకాలు వేరు. ఈ మంచి పుస్తకాలు మనల్ని ఆలోచింపచేస్తాయి. మనుషుల్ని చేస్తాయి. విజేతల్ని చేస్తాయి. బలవంతంగా ఏర్పడిన బంధువుల్లాంటి క్లాసు పుస్తకాలు కానివి. స్వేచ్చగా ఎన్నుకునే స్నేహితుల్లాంటి పుస్తకాలివి! ఇలాంటి పుస్తకాల్ని కొందరే రాయగలరు. ఆ కొందరిలో గంగ శ్రీనివాస్‌ ఒకరు.

ఇటీవల వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి పుంఖానుపుంఖంగా పుస్తకాలు వస్తున్నాయి. అయితే అవన్నీ అనువాదాలే! వ్యక్తిత్వం, వికాసం అంతా పాశ్చాత్య దేశాలకే పరిమితం అన్నట్టుగా అక్కడివారు రాసిన పుస్తకాలనే అనువదిస్తూ అందిస్తూ వస్తున్నారంతా. ఆ అనువాదాలకు భిన్నంగా మనదయిన వ్యక్తిత్వాన్నీ, వికాసాన్నీ తన పుస్తకంలో అందించారు గంగ
శ్రీనివాస్‌. కౌమార దశలోని పిల్లలు ఎలా ఉంటారు??వారితో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి? వారి ఎదుగుదలకి ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలి లాంటి చాలా విషయాలు మెయిన్‌టీన్‌లో విపులంగా విస్తృతంగా చర్చించారు ఈ రచయిత. శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో, మనిషికీ మనసుకీ చదువు అంత అవసరం. చదవడాన్ని అలవాటు చేసుకోగలిగేవారు, ఈ పుస్తకంతో ప్రారంభించం మంచిది.

ఇరవై ఆరు వారాల పాటు ధారావాహికగా నవ్య వీక్లిలో ప్రచురితమయిన 'మెయిన్‌టీన్‌'ను పాఠకులు విశేషంగా ఆదరించారు. చదివి తమలోని తప్పొప్పులను సరిదిద్దుకున్నామంటూ అనేకమంది ఉత్తరాలు రాశారు. వ్యక్తిత్వ వికాసాలు కావివి. మంచి కథలని కితాబులిచ్చారు. గంగ శ్రీనివాస్‌ కథారచయిత. కథనం బాగా తెలిసినవారు. ఆ విద్యను ఈ వ్యాస రచనలో అత్యద్భుతంగా చూపించి 'శభాష్‌' అనిపించారు. అందుకు వారు అభినందనీయులు. నాకు అన్నీ తెలుసు అన్న 'విజ్ఞానం'తో దయచేసి ఈ పుస్తకాన్ని చదవొద్దు. నాకేమీ తెలియదన్న 'వివేకం'తో ఈ పుస్తకాన్ని చదవండి. అన్నివిధాలా ఉపయోగపుతుంది.

- ఎ.ఎన్‌.జగన్నాథశర్మ

Preview download free pdf of this Telugu book is available at Mainteen