• Mahi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 115.2
    144
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహి

    Mahi

    Author:

    Publisher: Mukta Publications

    Pages: 297
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మహికి చైత్రతో ఉండే అనుబంధం
యెంత ప్రాచీనమో అంత నిత్యనూతనం...
చైత్రాగమనంతోనే మహి
చిగుర్చుతుంది, పూస్తుంది. మెల్లగా ఫలిస్తుంది.
యిదే కథ వసంతమంటే....

* * *

రాత్రి యెనిమిదవుతోంటే యింక ఆ రోజుకి మహి రాదు అనిపించి మహీకి ఫోన్ చేశారు వైదేహి.

"యేం చేస్తున్నావ్. రాలేదేంటి ఇటు. షిర్డీకి టికెట్స్ వచ్చేశాయి. డబ్బులు అడిగానుగా. నందూకి బండికి అడ్వాన్స్ యిస్తానని చెప్పాను. యింకా సెల్‌ఫోన్ కొనాలి. నువ్వు త్వరగా యిస్తే ఈ పనులన్నీ అవుతాయి," అన్నారు వైదేహి. మహి నిశ్శబ్దంగా ఉండిపోయింది.

"రేపు కాలేజికి వెళ్ళినప్పుడు యిటొచ్చి డబ్బులిచ్చి వెళ్ళు," అన్నారామె.

"వుదయమేనా...." మహి మాటలని పూర్తి కానివ్వకుండా, అసలామె ఏం చెపుతోందనే ఆలోచన లేకుండా,.

"వుదయమైనా అర్ధరాత్రయినా డబ్బులు డ్రా చేసుకోవచ్చుగా. ఎటిఎమ్ కార్డ్ లేదా! మహి యిలా పదిసార్లు చెప్పించుకోకు. నీకేం ఖర్చులుంటాయి చెప్పు. వొక్కదానివి. మాధవికి ఇద్దరు పిల్లలు. ఖర్చు జాస్తి. నీ అక్క పిల్లలు అవసరాలు నువ్వు తీర్చకపోతే యెవరు తీరుస్తారు. మీలా సంపాదించే అవకాశం లేకపోయింది. లేకపోతే యెందుకు అడుగుతాను. అయినా తల్లిని కదా, నీ సంపాదనపై ఆ మాత్రం హక్కు వుండదా," నవ్వుతూ అన్నారామె.

Preview download free pdf of this Telugu book is available at Mahi