• Mahayanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    180
    60% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహాయానం

    Mahayanam

    Pages: 244
    Language: Telugu
    Rating
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    '2.50/5' From 2 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

ఈ సంకలనంలో మూడు రకాల కథలు ఉన్నాయి.

నాలుగు కథలు “సాహస యాత్రలు” కోవలోకి వస్తాయి. మొదటి కథ, ప్రస్తుత కాలంలో, అమెజాన్ అడవుల్లో జరుగుతుంది. ఇది నిజంగా జరిగిన సంఘటనలని ఆధారంగా చేసుకుని రాసిన కథనం. రెండవ కథ, ప్రస్తుత కాలంలో, అలాస్కా మంచు బీడుల్లో జరిగిన అనుభవం. మూడవది, భవిష్యత్ కాలంలో, రెండు శతాబ్దాల తరువాత, విశ్వాంతరాళంలో జరుగుతుంది. నాల్గవది, భూత కాలంలో, ఆంధ్ర దేశంలో జరిగిన కథ. ఐదవది కూడ ఒక రకమైన సాహస యాత్రే – ఇది ఊహాలోకంలో జరిగిన “జరగని” కథ.

రెండవ వర్గానికి చెందినవి నిజంగా జరిగిన సంఘటనలని ఆధారంగా చేసుకుని రాసిన కథలు. లోలకం అన్న కథ ఆంధ్ర దేశంలో, ఇటీవల, జరిగిన వృత్తాంతం. ఇది బెడిసికొట్టి, అడ్డం తిరిగిన ఒక అమాయక వ్యక్తి సాహస యాత్ర అనుకోవచ్చు. కలిసిరాని కాలం నిజంగా జరిగిన సంఘటనల చుట్టూ అల్లిన కట్టుకథ.

మిగిలిన ఐదు కథలు వైజ్ఞానిక కల్పనలు. ఇవన్నీ విడి విడి కథలే కాని, నాలుగింటిలో మిడతంభొట్లు కథానాయకుడు. అందువల్ల చివర ఉన్న మరోలోకం కథలో ముందొచ్చిన నాలుగు కథల జ్ఞాపకాలు వస్తాయి. కాని ఈ ఐదు కథలనీ ఒక క్రమంలో చదవవలసిన అవసరం లేదు. ఇదొక కొత్త రకం ప్రయోగం.

ఈ సంకలనానికి పెట్టిన పేరు – మహాయానం, అంటే పెద్ద ప్రయాణం అని కాని అలాంటి ప్రయాణానికి అనుకూలమైన పెద్ద పడవ అని కాని అర్థం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కథలన్నీ ఒక రకమైన సాహస యాత్రలే!

Preview download free pdf of this Telugu book is available at Mahayanam