• Mahaneeyulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహనీయులు

    Mahaneeyulu

    Pages: 392
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీరామకృష్ణుల మహాసమాధి చెందిన తరువాత, జీవిత పరమార్థాన్ని తెలుసుకోగోరి, సర్వసంగ పరిత్యాగ మార్గాన్ని ఎంచుకున్న అనేక మంది యువకులు స్వామి వివేకానందను శరణు పొందారు. వారి జీవిత చిత్రణలే ఈ గ్రంథంలోని ముఖ్యాంశం. ఈ యువ సన్న్యాసులు, శ్రీరామకృష్ణ వివేకానంద భావప్రచార వ్యాప్తికి అలుపెరుగని కృషి సల్పారు. అంతేగాక శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష సన్న్యాస శిష్యుల జీవితాలకు వీరు సజీవ భాష్యాలుగా విరాజిల్లారు. 'గంగమాతను గంగా జలంతోనే పూజించమే' అన్నట్లు, స్వామి వివేకానంద 150వ జయంతి మహోత్సవాలలో భాగంగా, స్వామీజీ ఆశయాలకు కార్యరూపాన్ని ఇచ్చిన వారి సన్న్యాస శిష్యులను ధ్యానించడం ద్వారా స్వామీజీకి ఘనమైన నివాళిగా ఎంచి 'మహనీయులు' అనే పుస్తకాన్ని వెలువరిస్తున్నందుకు సంతోషిస్తున్నాం.

స్వామి వివేకానంద శిష్యులు సన్న్యాసులైనా, గృహస్థులైనా, భారతీయులైనా, విదేశీయులైనా - వారి విశేష వ్యక్తిత్వం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దురదృష్టవశాత్తూ, వారి సమగ్ర జీవితాలు లభ్యంలో లేవు. కానీ అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి, స్వామీజీ ప్రధాన సన్న్యాస శిష్యుల జీవితాలను స్వామి అబ్జజానందజీ 'స్వామీజీ పదప్రాంతే' పేరుతో మొట్టమొదటగా బెంగాలీలోనూ, తరువాత Monastic Disciples of Swami Vivekananda పేరిట ఆంగ్లంలోనూ వెలువరించారు. శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యుల జీవిత చిత్రణలను ఇది వరలో దైవంతో సహజీవనం పేరిట చాలా సంవత్సరాల క్రితం తీసుకురావడం జరిగింది. అయితే స్వామీజీ ప్రత్యక్ష సన్న్నాస శిష్యుల జీవిత చిత్రణలు ఇప్పటి వరకు తెలుగులో వెలుగు చూడలేదు. ఈ లోటును భర్తీ చేయడనికి, స్వామి వివేకానంద 150వ జయంతి మహోత్సవాలలో ఆయనను అన్ని కోణాలలో తెలుసుకోవాలని అభిలషించే వారికి ఈ గ్రంథం 'మహనీయులు' తప్పక ఉపయుక్తంగా ఉంటుంది. అంతేగాక, స్వామీజీ ఆశయ సాధనకు సాకారరూపాన్ని ఇచ్చిన శిష్యులు, ఈనాటి యువతరానికి స్ఫూర్తిని కలిగిస్తారనడంలో ఎలాటి సందేహమూ లేదు.

ఈ గ్రంథాన్ని అంకితభావంతో తెలుగులోకి అనువదించిన శ్రీమతి నేతి సీతాదేవి గారికి మా ధన్యవాదాలు.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Mahaneeyulu