• Mahaakavi SriSri Siri Katha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహాకవి శ్రీశ్రీ (సిరి కథ)

    Mahaakavi SriSri Siri Katha

    Publisher: Vignana Vedika

    Pages: 44
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

‘‘కలడు కలండనెడువాడు కలడో లేడో’’ అని ఒక ప్రక్క అనుమానిస్తూనే, అస్తమానం ఆ హరి (విష్ణువు) కథాగానం చేయడంకంటే` మనకు జీవితంలో ఎదురవుతున్న సమస్యలేమిటి? వాటికి పరిష్కారమార్గాలేమిటి? ఈ ప్రకృతి, సమాజం గురించి మనకున్న విశ్వాసాలు ఏ మేరకు శాస్త్రీయమైనవి? ప్రజలందరూ మెరుగైన జీవనాన్ని గడపడానికి మనముందున్న మార్గాలేమిటి? అందుకు మనకెదురయ్యే అడ్డంకులేమిటి? వాటిని అధిగమించడం ఎలా? మన భావదారిద్య్రాన్నుంచి మనల్ని విముక్తిచేసి, ప్రకృతి, సమాజంపట్ల మనకు సవ్యమైన అవగాహన కల్పించడానికి కృషిసల్పిన చైతన్యమూర్తులెవరు? వారి జీవితం, కృషి నుండి మనం నేర్చుకోదగిన విశేషాలేమిటి?`వగైరా విషయాలను కథాంశాలుగా తీసుకుంటే`మనకూ, మన సమాజానికీ, దేశానికీ ఎంతో మేలు జరుగుతుందనే దృఢవిశ్వాసంతో ‘హరికథ’కు బదులుగా ‘సిరికథ’ అనే పేరుతో దీన్ని రూపొందించడం జరిగింది.

‘సిరి’ అంటే ‘హరి’ భార్య లక్ష్మీదేవి అనే అర్థమే కాదు. ‘సంపద’ అనే అర్థమూ వుంది. ‘సంపద’ కేవలం కొందరి గుత్తసొత్తు కారాదనీ, సృష్టించేవారందరికీ సంపదపైన హక్కుండాలనీ, సకల జనులకూ సుఖ సంపదలు సామ్యవాద వ్యవస్థలోనే లభిస్తాయనీ విశ్వసిస్తూ, అట్టి వ్యవస్థ ఏర్పాటుకై చేసే కృషిలో భాగంగా చేపడుతున్న ఈ కథాకార్యక్రమానికి ‘సిరికథ’ అనే పేరే సముచితం కాగలదని నా అభిప్రాయం. తొలిప్రయత్నంగా మహాకవి శ్రీశ్రీ జీవితం, కృషిని ‘సిరికథ’ గా మలిచాం. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించిన మహాకవి శ్రీశ్రీ. తొలి ‘సిరికథ’ కు కథానాయకుడైన శ్రీశ్రీ (సిరి సిరి) పేరులో రెండు సిరులుండడం యాదృచ్ఛికం.

నవరసాలకు`ప్రత్యేకించి వీర, రౌద్ర, భయానక, బీభత్స రసాలకు అధికతర ప్రాధాన్యముండే యుద్ధాది వర్ణనలతోకూడిన ఐతిహాసిక కథాంశాలలోలాగా, సామాజిక కథాంశం`అందునా ఓ కవి జీవితం కథాంశంగా రూపొందే ‘సిరి కథ’ లో ఉత్తేజకరమైన కీర్తనలు, తొహరలు (దోహరలు), మంజరులు చొప్పించే అవకాశాలుండవు. అందుకే హరికథయొక్క గద్య పద్యాత్మక (చంపూ) లక్షణాన్ని మాత్రం కొంతమేరకు పాటించాను. తొలిప్రయత్నానికుండే పరిమితులెటూ ఉండనే ఉన్నాయి. ఈ వినూత్న రచనా ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారనీ, సంగీతపరంగా అవసరమైన మార్పుచేర్పులు చేసుకుని భాగవతార్‌లు ఈ సిరికథా కళారూపాన్ని కూడా జనరంజకంగా మలుచుకుంటారనీ విశ్వసిస్తాను.

- ముత్తేవి రవీంద్రనాథ్‌

Preview download free pdf of this Telugu book is available at Mahaakavi SriSri Siri Katha