• Mahaabharatam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహాభారతం 2

    Mahaabharatam

    Pages: 170
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

మహాభారతం

బాలల కోసం సరళ వ్యావహారికంలో భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య పర్వాలు

కౌరవుల చరిత్రనూ, పాండవుల భవితనూ మార్చివేసిన ఘట్టం కురుక్షేత్రమహా సంగ్రామం. 'యుద్ధషట్కం' అనబడే భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలు ఆరూ కురుక్షేత్ర సంబంధ దృశ్యాలను ఆవిష్కరిస్తాయి. అందులో భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య పర్వాలు నాలుగూ మహాసంగ్రామ దృశ్యాలను కళ్ళకు కడతాయి. ఆంధ్రమహాభారతంలోని ఈ నాలుగు సంగ్రామ పర్వాలనూ జగన్నాథశర్మ గారు సరళ సుందర వచన రచనగా అనుసృజన చేసిన తీరు అనన్య సామాన్యం. అస్త్రయుద్ధం, శస్త్రయుద్ధం, ఖడ్గయుద్ధం, గదాయుద్ధం - ఇలా అంతా యుద్ధమే! మహా యుద్ధ సర్వస్వాన్ని విసుగనిపించని రీతిలో, వచనంలో పచించడం కూడా వచన రచనా యుద్ధమే! చిన్నిచిన్ని పదాలతో రూపొందే సులభ వాక్య నిర్మాణశైలిని ఎన్నుకున్న శర్మగారు ఆ యుద్ధంలో జయించారు.

కురుక్షేత్ర వీరవిహారం చేసిన మహావీరుల సంగ్రామ కౌశలాన్ని మూలవిధేయంగా వర్ణించాలి. ఆ మహాయోధుల వ్యక్తిత్వాలను చక్కగా సాక్షాత్కరింపజేయాలి. ఈ రెండు సాముగారడీల్లోనూ శర్మగారు కృతకృత్యులయ్యారు. ఏకధారగా పరుగులు తీసే శర్మగారి వాక్యవిన్యాసం శరవేగాన్ని గుర్తుకు తెస్తుంది. ఈ నాలుగు పర్వాలలో కవి బ్రహ్మ తిక్కనగారి రచనా విన్యాసాన్ని శర్మగారు దర్శించారు. అధ్యయనం చేసారు. అర్థం చేసుకున్నారు. అనుభవించారు. నిజం చెప్పాలంటే మథనం చేసారు. మధుర నవనీతాన్ని తీశారు. తెలుగు పాఠకులకు బహుమతిగా అందించారు. అందుకని శర్మగారిని అభినందించడం మన వంతు.

- వక్కంతం సూర్యనారాయణరావ్

ధర్మానికీ అధర్మానికీ మధ్య జరిగిన నిర్ణాయకమైన యుద్ధమే కురుక్షేత్ర మహాసంగ్రామం. గ్లానికి లోనైన ధర్మాన్ని ఉద్ధరించేందుకు కంకణం కట్టుకున్నాడు శ్రీకృష్ణుడు. విజృంభించిన అధర్మానికి అభేద్యమైన కవచంగా నిలిచారు భీష్మద్రోణులు. వారిద్దరూ అజేయమైన యోధులు. తాను చేస్తున్నది తప్పు అని తెలిసీ అధర్మం పక్షంలో నిలిచి యుద్ధం చేసినవాడు కర్ణుడు. పాండవుల మీద ప్రేమ ఉన్నా మాటకు కట్టుబడి దుర్యోధనుడి పక్షంలో యుద్ధానికి దిగినవాడు శల్యుడు. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య పర్వాలలో ఈ వీరులు దుస్సహమైన పరాక్రమంతో చెలరేగి వినోదించిన 'రణక్రీడ'ను వర్ణించాడు వ్యాస భగవానుడు. దానికి సమాంతరంగా మాటలోని మర్మమెరిగిన మహాత్ముల మధ్య సంభాషణలు, వాటిలోని రాజనీతి చతురత, ఎత్తులూ, పై ఎత్తులూ చూపించాడు.

ఇటువంటి పాత్రల నాయకత్వంలో నడిచిన కథను మూలానికి విధేయంగా ఆవిష్కరించడం చాలా కష్టసాధ్యమైన పని. అందులోనూ అత్యంత క్లిష్టమైన భావాలను సరళమైన భాషలో క్లుప్తంగా చెప్పడం మరింత కష్టం. అయితే దీన్ని అలవోకగా సాధించి అందరి మన్ననలు అందుకున్నారు శ్రీ జగన్నాథశర్మగారు. పంచమవేదం సారాన్ని చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలా అందించారు శర్మగరు. అందుకుని ఆనందించడం మనవంతు.

- ఉప్పలూరి కామేశ్వరరావు

గమనిక: ఈ "మహాభారతం" ఈ-బుక్ సైజు 8.42 MB

Preview download free pdf of this Telugu book is available at Mahaabharatam
Comment(s) ...

When will you upload the remaining two parts of mahabharata. I thought part 1 and part 2 are in sequence but part 2 started from bheeshma parvam. So please uplisd the remaining parts.