• Madhumeham Samagra Avagahana Chikitsa
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మధుమేహం సమగ్ర అవగాహన - చికిత్స

    Madhumeham Samagra Avagahana Chikitsa

    Pages: 255
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

మధుమేహం సర్వసాధారణంగా కనిపిస్తున్న రుగ్మత. వాస్తవానికి ఇది వ్యాధి కాదు. ఈ రుగ్మత ఎవరికైనా వుండే అవకాశం ఉంది. మన సమాజంలో క్రమంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు, పారిశ్రామికీకరణ, నగరీకరణ, జీవన విధానాలలో మార్పులు - ఈవిధంగా అనేక అంశాలతోపాటు మధుమేహం కూడా విస్తరిస్తున్నది. చాలామంది తమకు మధుమేహం వుందనే విషయం కూడా గమనించరు. ఈరోజున మన దేశంలో జరిగే మరణాలకు మధుమేహం ఒక ప్రధానకారణంగా తయారైంది. అవగాహనాలోపమే ఇందుకు ప్రధాన కారణం. మధుమేహానికి గురికావడం మన చేతుల్లో పూర్తిగా లేకపోయినప్పటికీ దీనిని అదుపులో వుంచుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. వంశపారంపర్యత వలన వచ్చే మధుమేహం కంటే మన అపసవ్య జీవనవిధానం వలన సంక్రమించే మధుమేహమే అధికస్థాయిలో రాజ్యమేలుతోంది.

ప్రతిఒక్కరికీ మధుమేహం పట్ల సమగ్రమైన సరైన అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ గ్రంథం మీముందుకు తీసుకువచ్చాను. 14 అధ్యాయాలు, అనుబంధాలతో కూడిన మరొక అధ్యాయంతో సరైన అవగాహన అందించేందుకు కృషి జరపడమైనది. ఇది అదుపులో లేకపోతే వివిధ అవయవాలకు దాపురించే వ్యాధుల గురించి సవివరాలు అందించాను. ఇదే విధంగా మహిళలకు, పిల్లలకు డయాబెటిస్‌ ఎన్నెన్ని ఇబ్బందులను కల్పిస్తుందో; ముందస్తు జాగ్రత్తలను ఏవిధంగా తీసుకోవాలో వివరిస్తూ ప్రత్యేక అధ్యాయాలు జతపరిచాము.

డయాబెటిస్‌ ప్రాథమిక దశ నుండి, అదుపులో లేని దశవరకు ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో, చికిత్సల వివరాలు, నిర్ధారణ పరీక్షలు, ఆహార నియమాలు, ఇన్సులిన్‌ వివరాలు మొదలైన అంశాలన్నిటినీ పొందుపరిచాను. డయాబెటిస్‌ వున్నవారు దానిని పూర్తిస్థాయిలో అదుపులో వుంచుకుంటే సాధారణ జీవితకాలం కంటే అధికంగా జీవిస్తారని ఘంటాపథంగా చెప్పవచ్చు.

యావన్మందికీ మధుమేహం పట్ల సమగ్ర అవగాహన కల్పించేందుకు రాసిన ఈ గ్రంథం అందరికీ సంపూర్ణ ఆరోగ్య మార్గదర్శకత్వం వహిస్తుందని విశ్వసిస్తున్నాను.

- డా॥ కె. వేణుగోపాల్‌ రెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Madhumeham Samagra Avagahana Chikitsa