• Madhumalini
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మధుమాలిని

    Madhumalini

    Author:

    Pages: 146
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

"ద్రోహం చేస్తున్నావా చార్వాకా? గురుద్రోహం చేస్తున్నావా?" రెక్కలు తపతప కొడుతూ కనులు తెరిచి అతన్ని పలుకరించింది రుద్రాక్షుని పెంపుడు చిలుక.

ఒక్క అంగలో దాన్ని సమీపించి శబ్దం బయటికి రాకుండా మెడ పట్టుకున్నాడు చార్వాకుడు. కాలిక్రింద అదిమిపెట్టి ప్రాణాలు తీశాడు.

దారుణమైన ఆ దృశ్యాన్ని చూడలేనట్లు మబ్బుల చాటుకు పరుగు తీశాడు చంద్రుడు. వెన్నెల వెలుగులో పట్టపగలు మాదిరిగా వున్న పర్వాతాగ్రం చీకట్లతో నిండి పోయింది.

అదే సమయంలో పర్వతాల మధ్యనుంచి వినవచ్చింది ఆర్తనాదం.

"రక్షించండి పితృదేవా రక్షించండి...... దుష్ట మాంత్రికుడు శార్దూలుడు నన్ను బలాత్కరిస్తున్నాడు." విపరీతమైన భయంతో వణికిపోతున్న మధుమాలిని పిలుపు తెరలు తెరలుగా వచ్చి ఆశ్రమాన్ని తాకింది.

పాలలో కలిపిన చూర్ణపు ప్రభావం వల్ల కలత నిదుర పోతున్నాడు రుద్రాక్షుడు. చివాలున లేచి బయటికి పరిగెత్తుకు వచ్చాడు.

"రక్షించు తండ్రీ...... నన్ను రక్షించు." దీనాతి దీనంగా మరో మారు వినవచ్చింది మధుమాలిని కంఠం.

అమోఘమైన మేధస్సు మండూకుడి తంత్రానికి తల ఒగ్గి ఒక విధమయిన మగతలో మునిగిపోగా, వెనుకా ముందు ఆలోచించకుండా కూతురి కంఠం వినవచ్చిన దిశకు పరుగు తీశాడు రుద్రాక్షుడు.

Preview download free pdf of this Telugu book is available at Madhumalini