• Madam Blavatsky
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 180
    120
    -50% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మాడం బ్లవట్‌స్కీ

    Madam Blavatsky

    Author:

    Publisher: Master Yogaashram

    Pages: 184
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

అందరికీ తెలిసిన బ్లవట్‌స్కీ థియోసఫిస్టు. నా దృష్టిలో థియోలజిస్ట్‌. ఆమె 'Spiritualist' ... ఆత్మల నేస్తం. ఆమె సాగించిన ప్రయాణం జనసామాన్యంగా Soul Journey కావచ్చు ... నా వరకు 'Spiritual Journey' అది. ఆమె తన ప్రయోగాలతో Soul ని వెదకి పట్టుకోలేదు ... Spirit మూలాలను అందుకోగలిగింది. అదీ బ్లవట్‌స్కీ Spiritualism లోని 'Masterism'. నా దృష్టిలో బ్లవట్‌స్కీ ఓ Master Spirit.

బ్లవట్‌స్కీ యోగం చేసిందా అంటే ఏమో! ఆత్మతో పరిక్రమించింది ... నిశ్శబ్దంతో తలపడింది ... ఆత్మలతో సహవాసం చేసింది. తన ప్రయోగాలతో, ప్రయోగాలలో ఏ ఆత్మను దుర్వినియోగం చేయలేదు ... పైగా 'సత్‌' వినియోగమే ఆమెది. తన గమ్యంలో, గమనంలో మతాన్ని సమ్మతించలేదు కానీ గురువుల్ని కాదనలేదు. ఆమె దృష్టిలో గురువులు అంటే మాస్టర్స్‌ .... అంటే మహాత్మలు. వారి మాస్టరిజానికి తలవొగ్గిందే తప్ప గురుసంప్రదాయానికి కాదు. వారిని తన మార్గదర్శులుగా చేసుకుందే తప్ప వారి అడుగులకు
మడుగు లొత్తలేదు. వారి సహకారాన్ని అందుకుంటూనే స్వతంత్రించింది. ఏ ఆధ్యాత్మిక వారసత్వ నీడలు సోకకుండా థియోసాఫికల్‌ సొసైటీని స్థాపించింది. ఆత్మజ్ఞానానికి తప్ప అన్యానికి స్థానం లేదక్కడ. ఆమెది Spirit of Freedom. "True Faith is the Embodiment of Divine Charity" అన్నది బ్లవట్‌స్కీ జీవితం అందించే సందేశం.

బ్లవట్‌స్కీ రష్యాలో పుట్టినా ప్రపంచదేశాలు తిరుగుతూ భారతావనిలో తన 'ఆత్మీయ' 'మేధస్సు'కు ఒక రూపకల్పన చేసింది. ఆమె సహప్రయాణీకులలో అధికశాతం విదేశీయులే ... అన్నీ విదేశీపేర్లు ... దేశదేశాల సంచారం ... విచిత్ర వ్యక్తులతో సమావేశాలు ... ఆత్మీయ సమాలోచనలు. World Map అంత కాన్వాస్‌ బ్లవట్‌స్కీ జీవితం .... ఆ జీవితంపై ఎందరో మాస్టర్ల ప్రభావం. ఆ మాస్టర్ల మార్గదర్శకత్వం ఎలా ఉంటుందనటానికి అక్షరరూపం మాస్టర్‌ శార్వరి 'మాడం బ్లవట్‌స్కీ' పుస్తకం. ఓ విదేశీయురాల్ని చదువుతున్నామన్న ధ్యాస లేకుండా రసరమ్యంగా సాగిన రచన ఈ పుస్తకం. ఈ పుస్తకం చదువుతున్నంతసేపు బ్లవట్‌స్కీ ప్రపంచయాత్ర చేయదు. మనమే బ్లవట్‌స్కీతో పాటు ప్రతీచోటా ప్రత్యక్షమవుతాం .... బ్లవట్‌స్కీ విషయంలో శ్రీశార్వరి ఆత్మీయముద్ర అది.

Preview download free pdf of this Telugu book is available at Madam Blavatsky