-
-
మా యాత్ర
Maa Yatra
Author: Devulapalli Krishnamurthy
Publisher: Hyderabad Book Trust
Pages: 114Language: Telugu
దేవులపల్లివారు విశ్వవిద్యాలయాల కర్మాగారాల్లో తయారు చేయబడిన రచయిత కాదు. బహుగ్రంథ అవలోచన వరవడిలోని ఇనుప కచ్చడాల, అనుకరణ రచయితకాదు, పాఠకుణ్ణి ఎలాగైనా పిల్లిమొగ్గలతో రంజింప జేద్దామనుకునే రచయితకాదు. ఇంకా చాలా చాలా కాదు. ఆయన ఊరు వాడ రచయిత, సహజ రచయిత, సరాసరి బతుకు నుంచి వచ్చిన రచయిత. ఆయన లోపలికి వెడితే - దిగడానికి చక్కని మెట్లు గల దిగుడు బావి. అందులోని ప్రతి క్షణం వూటలు వూరే జీవజలంతో సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం, ఆధునిక సినిమాపై అనురక్తి - ఈ కోణాలన్నీ సమ్మేళనమై ఆయనలో నిలిచే వెలిగే లోవెలుగులు.
ఈ పుస్తకం వల్ల దేవులపల్లి వారి వెంటవుండి మనం కుడా తనివితీరా యాత్ర చేస్తాం. ఆయా మహత్తర ప్రదేశాలను కనులారా చూస్తాం. జీవితాంతం స్మృతి పేటికలో దాచుకుంటాం. ఇది ఒక పార్శ్వం. మరొకటి అతిముఖ్యమైనది. ఈ యాత్రలో పాల్గొన్న వారంతా దేవులపల్లి వారు యితరుల సంభాషణలో చెప్పిన వ్యక్తులంతా పరోక్షంగానే అయినా, మనకు అతిసన్నిహితంగా పరిచయమవుతారు.
- నగ్నముని
Yatra visheshaalu ilaa kuda raayochchaa? What a lively tour...touches your heart. Felt i was sitting in the bus...