• Maa Oori Kathalu
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మా వూరి కథలు

    Maa Oori Kathalu

    Pages: 270
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మొదటి కథ మోహన్ బొమ్మతో ‘రికార్డు బ్రేక్’ వచ్చింది. మొదటిరోజే... పత్రిక మార్కెట్టులోకి వచ్చిన గంటకే... 'పొగబండి కథల ఫేం ఓలేటి శ్రీనివాసభానుగారు ఫోన్ చేసి, ‘ఏం కథండీ! ఏం మనుషులండీ! నన్నెక్కడికో తీసుకెళ్ళిపోయారు,’ అంటూ అభినందించారు.
మావూరు షావుకారి పిచ్చయ్యగారబ్బాయి డా. సత్యన్నారాయణ (ఎముకల స్పెషలిస్టు) తెనాల్నించి ఫోన్ చేసి– “మన ఊర్ని, మనుషుల్ని, ఆ పాత రోజుల్ని, నా బాల్యాన్ని గుర్తు చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఊరందరి తరపున అభినందిస్తున్నాను." అన్నాడు.
ఒకరోజు విశ్వవిఖ్యాత చిత్రకారులు బాపుగార్నించి వుత్తరం వచ్చింది. ‘మీరు రాసిన ‘వానకాలం చదువులు’ కథలోలాగే ఒకసారి నాకు జరిగిందని’ లెటర్ రాశారు. అది చదివినాక నా జీవితం ధన్యమైందనుకున్నాను. ఆ ఉత్తరమే ఈ పుస్తకం అట్ట చివర బాపుగారి దస్తూరితోనే అచ్చేసుకున్నాను.
‘బీరం మస్తాన్‌రావునండీ! ‘బుర్రిపాలెం బుల్లోడు’ సినిమా డైరెక్టర్ని మీరు రాసిన ప్ర.సా.దు.లో మాంసం కూర మసాలా వాసన నా దాకా వచ్చిందండీ.’ అన్నారు.
ప్రముఖ సినీ దర్శకులు ‘మా పసలపూడి కథలు' ఫేం వంశీగారు ఫోన్ చేసి, 'కంగ్రాట్స్ రాజుగారూ, మీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా హిట్టే,’ అన్నారు.
సినిమా యాక్టర్ జయప్రకాష్‌రెడ్డిగారి నుండీ, ‘మా ఊరి కథలు చాలా బాగున్నాయి. కనగాల చెవిటిసాయిబు కథ అద్భుతం... అలాంటిదే నాకొక నాటకం రాసిపెట్టండి,’ అన్నారు ప్రముఖ నాటక రచయిత పూసలగారితో కలిసి మా ఇంటికి వచ్చి అభినందించారు.
‘ఐలవరం పెద్దకరణంగారమ్మాయినండీ! వీరయ్య ఇంకా చెరుకుపల్లిలో ఉన్నాడండీ!’ అంది.
‘గుడ్డి అచ్చమ్మ ఇంకా బతికే ఉందాండీ,’ ‘కనగాల గుప్తా హోటల్లో కాఫీ మేమూ తాగామండీ. ఎంత రుచో... చెవిటిసాయిబు దగ్గర మేమూ బట్టలు కుట్టిచ్చుకున్నామండీ…’ అంటూ రోజూ ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే వున్నాయి.
ఎండ్లూరి సుధాకర్‌గారు ఫోన్ చేసి, ‘మనం సంపాదించే లక్షలు, కోట్లు పోతాయి. కానీ మీరు రాసే అక్షరాలు కలకాలం ఉంటాయి. కథలు చాలా బాగున్నాయి. ఆపకండి కంటిన్యూ చేయండి,’ అంటూ అభినందించాడు.
నర్సారావుపేట నుంచి మాణిక్యరావుగారు ఫోన్ చేసి, ‘మీ సర్కస్ సుబ్బారావు కథలోని గ్రేట్ ఓరియంటల్ సర్కస్ నిడుబ్రోలులో మేమూ చూశాం, అన్నారు.
మార్కాపురం నుంచి, 'కనబడ్డా గేదెలన్నింటినీ మా పిల్లలు ఎంకటమ్మ అనే పిలుస్తున్నారండీ,’ అని ప్రసాద్‌గారూ, తుళ్ళిమల్లి విల్సన్‌సుధాకర్‌గారు ఫోన్ చేసి, ‘ఊళ్ళో అంతా గుడ్డోళ్ళే కథలో తాటాకుల మీద కాలుస్తున్న నాటుకోడి కమురు వాసన జైపూర్ దాకా వస్తుందండీ,’ అన్నారు.

- డా. నక్కా విజయరామరాజు

గమనిక: " మా వూరి కథలు " ఈబుక్ సైజు 16.9mb

Preview download free pdf of this Telugu book is available at Maa Oori Kathalu