-
-
మా భూమి - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
Maa Bhoomi Visalandhra Publishing House
Publisher: Visalandhra Publishing House
Pages: 107Language: Telugu
Description
ఈ నాటకంలో గ్రామీణ ప్రాంతాలలో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యంగా తీర్చిదిద్దబడిన పాత్రలు, బిగువైన సన్నివేశాలు, సహజమైన సంభాషణలు పాత్రోచితమైన భాష, మాండలికాలు, సామెతలు, ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. సందర్భోచితంగా ఉన్న పాటలు, ప్రేక్షకుల్ని ఉత్తేజపరుస్తాయి. ఇంత విశిష్టమైన నాటకం తెలుగు నాటకరంగంలో మరొకటి లేదనటం అతిశయోక్తి కానేకాదు.
హిందూ- ముస్లిం ఐక్యత, జనాభాలో సగంగా ఉన్న మహిళలు, ఉద్యమాలలో కూడా ముందుండాలనీ, ప్రజాఉద్యమాలలో సామాన్యులే అసమాన్యపాత్ర నిర్వహించగలరనే విషయాలను నాటకంలో స్పష్టం చేయడం ద్వారా 'మా భూమి' ఇతివృత్తానికి మరింత పుష్టి చేకూరింది.
కొన్ని గొప్ప నాటకాలు చదువుకునేందుకు మాత్రమే... ప్రదర్శన కష్టతరం.... మరికొన్ని నాటకాలు ప్రదర్శనలో మాత్రమే గొప్పగా వుంటవి. కాని 'మా భూమి' నాటకం చదువుటకూ, ప్రదర్శనకూ గొప్ప అనువైన నాటకం.
- ప్రచురణకర్తలు
Preview download free pdf of this Telugu book is available at Maa Bhoomi Visalandhra Publishing House
Login to add a comment
Subscribe to latest comments
